Rishi Sunak: క్షమించండి, అందుకు నేనే బాధ్యుడిని.. ఓటమిపై రిషి సునాక్
కాగా ఇప్పటి వరకు అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ కేవలం 68 చోట్ల మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో కన్జర్వేటివ్ పార్టీ ఓటమి ఖాయమైంది. లేబర్ పార్టీ తరఫున కైర్ స్టార్మర్ బ్రిటన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో ఓటమి పాలైన రిషి సునాక్ తన సొంత నిజయోకవర్గమైన రిచ్‌మండ్ అండ్ నార్తర్న్ అలర్టన్‌లో పార్టీ మద్ధతుదారుల్ని ఉద్దేశించి మాట్లాడారు....
ఇంగ్లండ్ ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఆ పార్టీ మెజారిటీ స్థానాలను దక్కించుకుంది. మొత్తం 650 మంది సభ్యుల హౌస్ ఆఫ్ కామన్స్‌లో 326 చోట్ల మెజార్టీలో ఆ పార్టీ కొనుసాగుతోంది. దీంతో ఇంగ్లండ్‌లో అధికార మార్పిడి జరగడం ఖాయమైంది. లేబర్ పార్టీ ఇంగ్లండ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.
కాగా ఇప్పటి వరకు అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ కేవలం 68 చోట్ల మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో కన్జర్వేటివ్ పార్టీ ఓటమి ఖాయమైంది. లేబర్ పార్టీ తరఫున కైర్ స్టార్మర్ బ్రిటన్ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో ఓటమి పాలైన రిషి సునాక్ తన సొంత నిజయోకవర్గమైన రిచ్‌మండ్ అండ్ నార్తర్న్ అలర్టన్‌లో పార్టీ మద్ధతుదారుల్ని ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా రిషి సునాక్ తన పార్టీకి క్షమాపణలు చెప్పారు. ఈ ఘోర పరాజయానికి తానే బాధ్యత వహిస్తున్నానని ప్రకటించారు. కాగా, సునాక్ మరో దఫా ఎంపీగా విజయం సాధించారు. ఇంగ్లండ్‌లో కన్జర్వేటీవ్ పార్టీ ఓటమికి.. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థం, ప్రజా సేవలు నెమ్మదించడం, పడిపోతున్న జీవన ప్రమాణాలే ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. భారత సంతతికి చెందిన రిషి సునాక్ లేబర్ పార్టీ గెలవడంపై కూడా స్పందించారు. ఆ పార్టీ నేత కీర్ స్టార్మర్‌కు అభినందనలు తెలియజేశారు.
అధికారం శాంతియుతంగా చేతులు మారుతుందని, అది తమ దేశ భవిష్యత్తు, స్థిరత్వంపై అందరికీ విశ్వాసం కలిగిస్తుందని సునాక్ అన్నారు. ఇదిలా ఉంటే బ్రిటన్‌లో గత 14 ఏళ్లుగా కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. రెండేళ్లక్రితం ప్రధానిగా రిషి సునాక్ ఎన్నికై.. ఈ పదవి చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే లేబర్ పార్టీ నేత, బ్రిటన్ తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న కీర్ స్టార్మర్ మాట్లాడుతూ.. 14 ఏళ్ల తర్వాత ఈ దేశ భవిష్యత్తు మళ్లీ కన్పిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజల తీర్పు తమపై పెద్ద బాధ్యతను ఉంచిందని, కొత్త అధ్యాయాన్ని ప్రారంభిద్దామని, దేశ పునరుద్ధరణ దిశగా పని మొదలుపెడదామని పిలుపునిచ్చారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..