దసరా వరకు స్కూల్స్ తెరిచే ప్రసక్తి లేదు..!

|

Jun 09, 2020 | 10:00 AM

దేశంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల స్కూల్స్, పాఠశాలలు అన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి ఎప్పుడు తగ్గుతుందో.? స్కూల్స్ ఎప్పుడు రీ-ఓపెన్ చేస్తారో అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.!

దసరా వరకు స్కూల్స్ తెరిచే ప్రసక్తి లేదు..!
Follow us on

దేశంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల స్కూల్స్, పాఠశాలలు అన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాప్తి ఎప్పుడు తగ్గుతుందో.? స్కూల్స్ ఎప్పుడు రీ-ఓపెన్ చేస్తారో అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.! అయితే తాజాగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆగస్టు తర్వాతే స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్ చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఇదే విషయంపై టీఎస్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ స్పందించారు.

తెలంగాణలో ప్రైవేట్ స్కూల్స్ ఇప్పట్లో తెరిచే ఆలోచన లేదని ఆయన తేల్చి చెప్పారు. దసరా వరకు స్కూళ్లు తెరిచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మూడు నెలలు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చూసిన తర్వాత స్కూళ్ళు, పాఠశాలలు తెరవడంపై ఆలోచిస్తామన్నారు. స్కూళ్లలో శానిటైజేషన్ నిబంధనలు, భౌతిక దూరం పాటించడం వంటివి కష్టతరమని చెప్పుకొచ్చారు. కాగా, జులై 1 నుంచి 15వ తేదీ వరకు సీబీఎస్‌ఈ, ఐసీఎస్ఈ/ఐఎస్‌సీ ఎగ్జామ్స్ జరగాల్సి ఉండగా.. జులై 26న నీట్, జూలై 18 నుంచి 23 వరకు జేఈఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

Also Read: 

రేపటి నుంచి శ్రీవారి ఉచిత దర్శనం టోకెన్లు జారీ…

జగన్ కీలక నిర్ణయం.. త్వరలోనే వైద్యశాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.!

ఏపీ వెళ్ళాలనుకునేవారికి ముఖ్య గమనిక.. జగన్ సర్కార్ కీలక ప్రకటన..

నిరుద్యోగులకు శుభవార్త.. గురుకులాల్లో టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..