పవర్ స్టార్ తనయుడితో అడవి శేష్ మీటింగ్! ఎందుకంటే?

టాలీవుడ్‌లో బాలీవుడ్ రేంజ్ సినిమాలతో మెస్మరైజ్ చేస్తున్న హీరో అడివి శేష్.. జనసేనాని పవన్ కళ్యాణ్ పిల్లలు అకీరా, ఆద్యలతో సరదాగా స్పెండ్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.  రేణు దేశాయ్, అకీరా, ఆద్యలని వారి నివాసంలో కలుసుకున్నట్లు శేష్ వివరించాడు.  ఈ సందర్భంగా అకీరా గురించి శేష్ ట్విట్టర్ ద్వారా ఆసక్తికర విషయాలను తెలియజేశాడు. అందమైన కుర్రాడు అకీరాతో ఈ రోజు గడిపా. అకీరాకు ఎవరు చిత్రం చాలా బాగా నచ్చింది. లంచ్ మీటింగ్‌లో అనేక […]

పవర్ స్టార్ తనయుడితో అడవి శేష్ మీటింగ్! ఎందుకంటే?
Akira Nandan loved Adivi Sesh’s Evaru

Updated on: Aug 27, 2019 | 4:11 PM

టాలీవుడ్‌లో బాలీవుడ్ రేంజ్ సినిమాలతో మెస్మరైజ్ చేస్తున్న హీరో అడివి శేష్.. జనసేనాని పవన్ కళ్యాణ్ పిల్లలు అకీరా, ఆద్యలతో సరదాగా స్పెండ్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.  రేణు దేశాయ్, అకీరా, ఆద్యలని వారి నివాసంలో కలుసుకున్నట్లు శేష్ వివరించాడు.  ఈ సందర్భంగా అకీరా గురించి శేష్ ట్విట్టర్ ద్వారా ఆసక్తికర విషయాలను తెలియజేశాడు.

అందమైన కుర్రాడు అకీరాతో ఈ రోజు గడిపా. అకీరాకు ఎవరు చిత్రం చాలా బాగా నచ్చింది. లంచ్ మీటింగ్‌లో అనేక విషయాలు మాట్లాడుకున్నాం. అకీరా వాయిస్ చాలా గంభీరంగా ఉంది. అకీరా పొడవు 6 అడుగుల 4 అంగుళాలు. మేమిద్దరం ఎడమచేతి వాటం కలిగిన వాళ్ళం. అంతే కాదు మా ఇద్దరిలో అనేక కామన్ విషయాలు ఉన్నాయి అని అకిరా గురించి శేష్ చెప్పుకొచ్చాడు.

ఇక రేణు దేశాయ్ అద్భుతమైన రచయిత అని అడివి శేష్ ప్రశంసలు కురిపించాడు. అడివి శేష్.. రేణు దేశాయ్, అకీరాతో కలసి దిగిన సెల్ఫీలు శేష్ ఫోస్ట్ చేశాడు. అడివి శేష్, రెజీనా నటించిన ఎవరు చిత్రం ఇటీవల విడుదలై మంచి విషయాన్ని సొంతం చేసుకుంది.