AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి చేసుకోవాలనుకుంటే చేతిలో చిల్లిగవ్వలేదు ః ఆదిత్య నారాయణ్‌

ఏ దుర్ముహూర్తాన పుట్టిందో కానీ కరోనావైరస్‌ ప్రపంచాన్ని కకావికలం చేసేస్తోంది.. మనుషుల ప్రాణాలను హరించడమే కాదు.. ఆర్ధిక వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తోంది.. వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడం...

పెళ్లి చేసుకోవాలనుకుంటే చేతిలో చిల్లిగవ్వలేదు ః ఆదిత్య నారాయణ్‌
Balu
|

Updated on: Oct 15, 2020 | 11:46 AM

Share

ఏ దుర్ముహూర్తాన పుట్టిందో కానీ కరోనావైరస్‌ ప్రపంచాన్ని కకావికలం చేసేస్తోంది.. మనుషుల ప్రాణాలను హరించడమే కాదు.. ఆర్ధిక వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తోంది.. వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడం ఓ విధంగా మేలు చేసినప్పటికీ దాని వల్ల కీడు కూడా జరిగింది.. ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి.. చేద్దామంటే పనులు లేవు.. చేతిలో చిల్లిగవ్వలేదు.. సామాన్యులే కాదు.. అంతో ఇంతో పేరు తెచ్చుకున్న సెలబ్రిటీలకు కూడా కష్టాలు తప్పడం లేదు.. ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌, టెలివిజన్‌ హోస్ట్‌ ఆదిత్య నారాయణ్‌ కూడా డబ్బులు లేక అవస్తలు పడుతున్నారు.. త్వరలో తన ప్రేయసి శ్వేతా అగర్వాల్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడు కానీ పెళ్లి ఖర్చులకు అతడి దగ్గర డబ్బుల్లేవు.. నిజమే ..! లాక్‌డౌన్‌లో చేయడానికి పనుల్లేక ఖాళీగా ఉన్నాడు.. దాంతో పొదుపు చేసుకున్న సొమ్మంతా ఖర్చయ్యింది.. చివరాఖరికి సేవింగ్స్‌ కోసం మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టిన డబ్బును కూడా వెనక్కి తీసుకున్నాడు.. ప్రస్తుతం అతడి అకౌంట్‌లో 18 వేల రూపాయలే ఉన్నాయట! ఈ విషయాన్ని ఆదిత్య నారాయణే చెప్పుకొచ్చాడు.. ఈ నెల నుంచి పని చేయకపోతే మనుగడ కష్టమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.. బతకడానికి బైక్‌ను అమ్ముకోవాలేమోనని బాధగా చెప్పాడు.. మొత్తంగా మనం కఠినమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నామని చెప్పిన ఆదిత్యనారాయణ్‌ త్వరలో మంచి రోజులు రావాలని కోరుకున్నాడు.

Follow Us
ఘనంగా టాలీవుడ్ హీరోయిన్ సీమంతం.. ఎవరో గుర్తుపట్టారా? ఫొటోస్ ఇదిగో
ఘనంగా టాలీవుడ్ హీరోయిన్ సీమంతం.. ఎవరో గుర్తుపట్టారా? ఫొటోస్ ఇదిగో
ఇకపై పోలీసు వాహనాలు కూడా ఫైన్లు వేస్తాయ్ జాగ్రత్త!
ఇకపై పోలీసు వాహనాలు కూడా ఫైన్లు వేస్తాయ్ జాగ్రత్త!
5 సార్లు IVF..1000కు పైగాఇంజెక్షన్లు..ఎట్టకేలకు 'అమ్మ'గా ప్రమోషన్
5 సార్లు IVF..1000కు పైగాఇంజెక్షన్లు..ఎట్టకేలకు 'అమ్మ'గా ప్రమోషన్
యుగానుకూల మాతృత్వంపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
యుగానుకూల మాతృత్వంపై మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
తీవ్రమైన కాలినొప్పి అని ఆస్పత్రికి వెళ్తే..ఎక్స్‌రే చూసి వైద్యులే
తీవ్రమైన కాలినొప్పి అని ఆస్పత్రికి వెళ్తే..ఎక్స్‌రే చూసి వైద్యులే
వీళ్లు ఎల్‌నినో కంటే యమ డేంజర్‌.. పంటచేలో పచ్చి నకిలీగాళ్లు
వీళ్లు ఎల్‌నినో కంటే యమ డేంజర్‌.. పంటచేలో పచ్చి నకిలీగాళ్లు
హైదరాబాద్ వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. కాచిగూడ నుంచి..
హైదరాబాద్ వాసులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. కాచిగూడ నుంచి..
నలుపు, తెలుపు, నీలం.. వాటర్ ట్యాంక్ ఏది మంచిదో తెలుసుకోండి..!
నలుపు, తెలుపు, నీలం.. వాటర్ ట్యాంక్ ఏది మంచిదో తెలుసుకోండి..!
బంగారం, వెండి కాదు.. భవిష్యత్తులో దీనిదే హవా..
బంగారం, వెండి కాదు.. భవిష్యత్తులో దీనిదే హవా..
అన్నా ఆల్ ది బెస్ట్.. 'జబర్దస్త్' నుంచి మరో డైరెక్టర్..
అన్నా ఆల్ ది బెస్ట్.. 'జబర్దస్త్' నుంచి మరో డైరెక్టర్..