
Actress Shweta Kumari in Drugs Case: డ్రగ్స్ కేసులో అరెస్టైన నటి శ్వేతా కుమారిని నార్యోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు కోర్టులో హాజరుపరుచనున్నారు. ప్రస్తుతం శ్వేతా కుమారి హైదరాబాద్ లింకులపై ఎన్‌సీబీ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ముంబై ఎన్‌సీబీ అధికారులు..హైదరాబాద్ ఎన్‌సీబీ అధికారుతో సంప్రదింపులు జరుపుతున్నారు. మాఫియాడాన్ కరీంలాలాతో కలిసి శ్వేతా కుమారి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో నిర్ధారించింది.
ముంబైలోని మిరా రోడ్డులో ఉన్న ఓ హోటల్‌లో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు ఈ ఆదివారం సోదాలు చేశారు. ఈ క్రమంలో డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తితో పాటు నాలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన శ్వేతా కుమారిని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న చాంద్ మహమ్మద్‌ను నుంచి 400గ్రాముల మెఫెడ్రోన్ ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.8-10లక్షల వరకూ ఉంటుందని చెప్పారు. ఆదివారం శ్వేతా కుమారిని అదుపులోకి తీసుకోగా.. సోమవారం ఆమె ఎస్కేప్ అవ్వడం కలకలం రేపింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు సోమవారం రాత్రి శ్వేతాను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మాఫియా డాన్ కరీంలాలాపై ఎన్సీబీ లుకౌట్ నోటీసు జారీ చేసింది.
Also Read :
జంగారెడ్డిగూడెంలో హృదయ విదారక ఘటన.. తల్లి మృతదేహంతోనే ఐదు రోజులు జీవనం
భర్త స్నేహితుడితో సాన్నిహిత్యం..కట్టుకున్నవాడిని చంపించిన వైనం..గుత్తిలో దారుణం