Anjali : కొత్త ఇమేజ్ కోసం అంజలి ఆరాటం..తెలుగమ్మాయి ఫేట్ మారుతుందా..ప్రయత్నం ఫలిస్తుందా..?

|

Dec 24, 2020 | 12:48 PM

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్ర వేసిన తెలుగుమ్మాయి అంజలిని మన ప్రజలు ఎంతగా ఓన్ చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె చీరకట్టు, గోదావరి యాసలో మాట్లాడే విధానానికి ప‌్రేక్షకులు ఫిదా అయ‌్యారు.

Anjali : కొత్త ఇమేజ్ కోసం అంజలి ఆరాటం..తెలుగమ్మాయి ఫేట్ మారుతుందా..ప్రయత్నం ఫలిస్తుందా..?
ఆ తర్వాత అంజలి  పలు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. దాంతో ఈ అమ్మడు స్పెషల్ సాంగ్స్ లోనూ కనిపించి కవ్వించింది. సూర్య నటించిన సింగం 3, అలాగే అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది అంజలి 
Follow us on

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్ర వేసిన తెలుగుమ్మాయి అంజలిని మన ప్రజలు ఎంతగా ఓన్ చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె చీరకట్టు, గోదావరి యాసలో మాట్లాడే విధానానికి ప‌్రేక్షకులు ఫిదా అయ‌్యారు. అయితే తన కెరీర్‌ కు తన ఇమేజే అడ్డని అనుకున్నారో ఏమో తెలియదు కానీ ..ఇప్పుడు కొత్త పంథాను ఎంకుకున్నారు. ఇంతకు ముందు ఎప్పుడూ చూడనంత బోల్డ్‌ యాక్ట్‌తో షాక్ ఇచ్చారు అంజలి. అయితే ఈ సీన్స్‌తో తెలుగు ఆడియన్స్‌ షాక్‌ అయినా.. కొంత మంది మేకర్స్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారట. బోల్డ్ కంటెంట్‌తో ఓటీటీ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్న మేకర్స్‌ అంజలి డేట్స్‌ కోసం క్యూ కడుతున్నారన్నది ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తోన్న మాట

గతంలోనూ తన ఇమేజ్‌ మార్చుకునే ప్రయత్నం గట్టిగానే చేశారు అంజలి. గ్లామర్‌ రోల్స్‌ చేయడంతో పాటు ఐటమ్‌ సాంగ్స్‌లోనూ నర్తించారు. కానీ ఆ ప్రయత్నాలేవి పెద్దగా వర్క్‌ అవుట్ కాలేదు. అంజలి అంటే సీతే.. అని ఫిక్స్ అయిన మేకర్స్ హోమ్లీ రోల్స్‌ కే అంజలిని ఫిక్స్ చేసేశారు.. అయితే ‘పావ కథైగళ్’‌తో వచ్చిన ఛాన్స్‌ను పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకున్న అంజలి.. కొత్త ఇమేజ్‌తో దూసుకుపోతున్నారు.

Also Read :

New virus strain : రాజమండ్రిలో కొత్త రకం కరోనా వైరస్ కలకలం..యూకే నుంచి వచ్చిన మహిళకు వైరస్ పాజిటివ్

రూ. లక్షల డబ్బు ఉన్న సంచి లాక్కుని కోతి పరార్..కన్నీరుమున్నీరయిన వృద్ధుడు. చివరకు ఏం జరిగిందంటే..?

Survey training institute : తిరుపతిలో సర్వే శిక్షణ సంస్థ ఏర్పాటుకు భూమి కేటాయింపు…అర్బన్ మండలంలోని ఆ గ్రామంలో