బీజేపీలో చేరబోతున్నట్లుగా వస్తున్న వర్తలపై నటుడు విశాల్ స్పష్టత వచ్చింది. గతంలో జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ ఉప ఎన్నికల బరిలో నిలిచి నామినేషన్ కూడా వేసిన విశాల్ చివరి క్షణంలో తన నామినేషన్ ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. విశాల్ గతంలో నడిగర్ సంఘం, సినీ నిర్మాతల సంఘం ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించాలని అనుకున్నారు. తాజాగా తమిళనాడులో ఎన్నికల హీట్ పెరగడంతో తమిళ హీరోల ఎంట్రీలపై వార్తలు జోరందుకున్నాయి.
ఈ నేపథ్యంలో విశాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్ అపాయింట్‌మెంట్‌ను కోరాడని ఇటు ప్రధాన మీడియాతోపాటు అటు సోషల్ మీడియాలోనూ వార్తలు హోరెత్తాయి. ఈనేపథ్యంలో ఈయన త్వరలో బీజేపీ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే తను బీజేపీ పార్టీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నటుడు విశాల్ మేనేజర్ కొట్టిపారేశారు.
ఈ తరుణంలో విశాల్ మేనేజర్ హరికృష్ణన్ సదరు వార్తలను ఖండించారు. అవన్నీ అవాస్తవాలేనని చెప్పుకొచ్చారు. విశాల్ రాజకీయాల్లోకి రావడం లేదని అన్నారు. ఎవరూ ఇలాంటి వార్తలను నమ్మవద్దని సూచించారు. హరికృష్ణన్ పెట్టిన ట్వీట్‌తో విశాల్ రాజకీయాల్లోకి రావడం లేదని అభిమానుకు స్పష్టత వచ్చింది. బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు.