నిలకడగా రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి

సీనియర్ హీరో రాజశేఖర్ మాత్రం ఇంకా కరోనాతో పోరాడుతున్నారు. రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. రాజశేఖర్ కోవిడ్ కోసం చికిత్స పొందుతున్న సిటీ న్యూరో సెంటర్ వైద్యులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు.

నిలకడగా రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి
Follow us
Balaraju Goud

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 31, 2020 | 4:53 PM

సీనియర్ హీరో రాజశేఖర్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. నటుడు రాజశేఖర్‌తో పాటు కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది. అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరు కరోనా నుంచి కోలుకున్నా.. రాజశేఖర్ మాత్రం ఇంకా కరోనాతో పోరాడుతున్నారు. రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. రాజశేఖర్ కోవిడ్ కోసం చికిత్స పొందుతున్న సిటీ న్యూరో సెంటర్ వైద్యులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు.

ఇన్ని రోజులు వెంటి లేటర్ ద్వారా శ్వాస అందించడం జరిగింది. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్ తొలగించడం జరిగింది. స్వతంత్ర్యంగా శ్వాస తీసుకోగలుగుతున్నారు. ఇన్ఫెక్షన్ కూడా దాదాపు తగ్గిందని వైధ్యులు తెలియజేశారు. మరికొన్ని రోజుల్లోనే ఆయన ఐసీయూ నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది అన్నట్లుగా కుటుంబ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు.