ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు సతీమణి కన్నుమూశారు. వెంకటేశ్వరరావు భార్య విజయలక్ష్మి (74) ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు విజయలక్ష్మి. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. కాగా రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు భార్య మరణించడంతో పలువురు సినీ ప్రముఖులు, నటులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
Read More: కొత్తగా 13 మంది సబ్ కలెక్టర్‌లను నియమించిన ఏపీ ప్రభుత్వం