Tadipatri Clash : అనంతపురం జిల్లా తాడిపత్రి ఘర్షణ కేసులో అరెస్టు అయిన 10 మంది నిందితులను భారీ బందోబస్త్ మధ్య కోర్టు తరలించారు. తాడిపత్రిలో ఘర్షణలపై ఇంకా కొనసాగుతునే ఉంది. సోమశేఖర్, పవన్‌కుమార్, జగన్నాథరెడ్డి, ఓబీరెడ్డి, నరేంద్రరెడ్డి, రమణ, ఓబులరెడ్డి, కేశలరెడ్డి, రవి, బాబులను గుంతకల్లు కోర్టుకు తరలించారు.
ఇదాలా ఉంటే… పెద్దారెడ్డి , జేసీల మధ్య ఇంకా మాటల తూటాలు పేలుతునే ఉన్నాయి.. రగడ ఇంకా భగ్గుమంటూనే ఉంది. నా కుటుంబం జోలికి వస్తే..నడిబజారుకు ఈడ్చి చెప్పుతో కొడతానంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. చెప్పుతో కొట్టించుకోవడానికి రెడీగా ఉన్నానన్నారు.
తాడిపత్రి వివాదానికి మూలకారణమైన సోషల్ మీడియా పోస్టులపై రెండు రోజుల క్రితం ఘాటుగా స్పందించారు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఎవరో ఒకరం తేల్చుకుందాం రా అంటూ సవాల్ విసిరారు.. దానికే ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు జేసీ.. రాళ్లు రువ్విన ఘటనలో గాయపడిన మనోజ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసులు నమోదు చేశారు పోలీసులు. జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కొడుకు అస్మిత్‌రెడ్డిపై ఇప్పటికే 307తోపాటు ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు.