
ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి చిక్కారు. కళ్యాణ లక్ష్మీ పథకం కింద రావల్సిన డబ్బులు ఇవ్వడానికి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని గ్రామానికి చెందిన రాజేశ్వరి కళ్యాణ లక్ష్మి పథకం కోసం వీఆర్వో కు దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తును పై అధికారులకు పంపించాలంటే పది వేలు రూపాయలు ఇవ్వాలని వీఆర్వో డిమాండ్ చేశారు. ఐదు వేల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించినా.. విఆర్ఓ నిరాకరించారు. దీంతో చేసేదిలేక ఏసీబీ అధికారులకు రాజేశ్వరి ఫిర్యాదు చేసింది. పక్కా ఫ్లాన్ ప్రకారం తాసిల్దార్ కార్యాలయంలో వీఆర్వో ఏడు వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీఆర్ఓ కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారి మధుసూదనరాజు తెలిపారు..