కీసర ఎమ్మార్వో నాగరాజు బినామీల లాకర్లలో భారీగా బంగారం.!

|

Oct 22, 2020 | 3:22 PM

మేడ్చల్ జిల్లాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ మృతి చెందిన కీసర తహశీల్ధార్ నాగరాజు కేసులో ఏసీబీ సోదాలను ముమ్మరం చేసింది. నాగరాజు కుటుంబానికి బినామిగా అనుమానిస్తున్న నందగోపాల్ ఇంట్లో రెండు రోజుల క్రితం సోదాలు చేసిన ఏసీబీ అధికారులు… తాజాగా నందగోపాల్ కు సంబంధించి ఐసిఐసి బ్యాంకు లాకర్ లో సోదాలు చేస్తున్నారు. నందగోపాల్ కు సంబంధించి లాకర్ పూర్తిగా నాగరాజు భార్య స్వప్న ఉపయోగించుకుంటున్నట్లు ఏసీబీ విచారణలో నందగోపాల్ తెలిపిన నేపథ్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. […]

కీసర ఎమ్మార్వో నాగరాజు బినామీల లాకర్లలో భారీగా బంగారం.!
Follow us on

మేడ్చల్ జిల్లాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ మృతి చెందిన కీసర తహశీల్ధార్ నాగరాజు కేసులో ఏసీబీ సోదాలను ముమ్మరం చేసింది. నాగరాజు కుటుంబానికి బినామిగా అనుమానిస్తున్న నందగోపాల్ ఇంట్లో రెండు రోజుల క్రితం సోదాలు చేసిన ఏసీబీ అధికారులు… తాజాగా నందగోపాల్ కు సంబంధించి ఐసిఐసి బ్యాంకు లాకర్ లో సోదాలు చేస్తున్నారు. నందగోపాల్ కు సంబంధించి లాకర్ పూర్తిగా నాగరాజు భార్య స్వప్న ఉపయోగించుకుంటున్నట్లు ఏసీబీ విచారణలో నందగోపాల్ తెలిపిన నేపథ్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలలో 1256 గ్రాముల బంగారు నగలు లభ్యమయ్యాయి. ఈ సందర్భంలో ఏసీబీ అధికారులకు మరిన్ని ఆస్తులకు సంబంధించిన ఆధారాలు దొరికినట్టు సమాచారం.