AB De Villiers Comeback With T20 World Cup: ఏబీ డివిలియర్స్.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏబీని ఫ్యాన్స్ ముద్దుగా ‘మిస్టర్ 360’గా అని పిలుచుకుంటారు. ఫార్మాట్ ఏదైనా కూడా డివిలియర్స్ తన విధ్వంసకరమైన ఆటతో ప్రత్యర్ధులను భయపెడతాడు. 2018లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఏబీ.. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తరపున ఆడతానని మనసులోని మాట బహిర్గతం చేసిన విషయం విదితమే.
ఇక దీనిపై సౌతాఫ్రికా వన్డే కెప్టెన్ క్వింటన్ డికాక్ స్పందించాడు. ”ఆస్ట్రేలియా వేదికగా వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్‌కప్ జట్టు సెలెక్షన్‌లో డివిలియర్స్ మా ప్రిఫరెన్స్‌గా ఉంటాడు. అతడు ఫిట్‌గా ఉంటే ఖచ్చితంగా తీసుకుంటాం. ఏ జట్టైనా డివిలియర్స్ లాంటి ఆటగాడిని తీసుకోవడానికి ఇస్తాపడుతుందని డికాక్ పేర్కొన్నాడు.
Also Read:
జగన్ సర్కార్ మరో సంచలనం.. ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ..
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ కాలేజీల్లో ఐఐటీ, జేఈఈలకు శిక్షణ..
Part 3: ”సుశాంత్‌ది హత్యేనా” ఆత్మ ఏం చెప్పింది.? షాకింగ్ వాస్తవాలు…