ఇకపై బీఎస్ఎన్ఎల్ సంస్థలోనూ ఆధార్ సేవలు..?

కొత్తగా ఆధార్ నమోదు చేసుకునేవారికి శుభవార్త ప్రకటించింది బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ. ఆధార్‌లో మార్పులు, చేర్పులు తప్పుల సవరణలు చేయించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారా..? ఇకపై ఆ అవసరం లేదు. మీ దగ్గరలోని బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సేవా కేంద్రానికి వెళితే సరిపోతుంది. కేవలం 15 నిమిషాల్లో ఆధార్ నమోదు, అప్ డేషన్ అయిపోతుంది. కొత్తగా నమోదు చేయించుకునే వారికి ఎలాంటి ఛార్జీలు వర్తించవు. మార్పులు, చేర్పులు చేసుకునే వారికి మాత్రమే సర్వీసు ఛార్జీలు వర్తిస్తాయి. ప్రస్తుతం అన్ని సేవలకు ఆధార్ […]

ఇకపై బీఎస్ఎన్ఎల్ సంస్థలోనూ ఆధార్ సేవలు..?
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 21, 2019 | 6:28 PM

కొత్తగా ఆధార్ నమోదు చేసుకునేవారికి శుభవార్త ప్రకటించింది బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ. ఆధార్‌లో మార్పులు, చేర్పులు తప్పుల సవరణలు చేయించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారా..? ఇకపై ఆ అవసరం లేదు. మీ దగ్గరలోని బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సేవా కేంద్రానికి వెళితే సరిపోతుంది. కేవలం 15 నిమిషాల్లో ఆధార్ నమోదు, అప్ డేషన్ అయిపోతుంది. కొత్తగా నమోదు చేయించుకునే వారికి ఎలాంటి ఛార్జీలు వర్తించవు. మార్పులు, చేర్పులు చేసుకునే వారికి మాత్రమే సర్వీసు ఛార్జీలు వర్తిస్తాయి.

ప్రస్తుతం అన్ని సేవలకు ఆధార్ తప్పనిసరి అయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా ప్రైవేటు సంస్థలు తమ సేవలను ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఆధార్ తప్పనిసరిగా మారింది. బ్యాంకులు కూడా ఆధార్ సేవలు అందిస్తున్నాయి. కాగా, రెండేళ్ల క్రితం తపాలా శాఖ యూఐడీఏఐతో ఒప్పందం కుదుర్చుకుని ఆధార్ నమోదు, అప్‌డేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. తాజాగా బీఎస్ఎన్ఎల్ సంస్థ కూడా ముందుకొచ్చింది. ఇకపై బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారుల సేవా కేంద్రాల్లో ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 6వేల ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. వాటిలో 178 కేంద్రాలను తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్‌లో 57 కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.

Latest Articles
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
పుష్పరాజ్‏కు షూ స్టెప్ కొరియోగ్రఫీ చేసింది ఎవరో తెలుసా ..?
పుష్పరాజ్‏కు షూ స్టెప్ కొరియోగ్రఫీ చేసింది ఎవరో తెలుసా ..?
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న మంటలు.. 52 మందిపై కేసులు నమోదు
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న మంటలు.. 52 మందిపై కేసులు నమోదు
అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ
అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ
వేసవిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి వ్యాయామాలు
వేసవిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి వ్యాయామాలు
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
మేలో శని జయంతి ఎప్పుడు? తేదీ, శుభ సమయం తెలుసుకోండి..
మేలో శని జయంతి ఎప్పుడు? తేదీ, శుభ సమయం తెలుసుకోండి..
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?
సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే..
సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే..
స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. 40 వేల ఫోన్‌ 28,000 వేలకే
స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. 40 వేల ఫోన్‌ 28,000 వేలకే