హిజ్రాతో ప్రేమ‌, స‌హ‌జీవ‌నం..నెల రోజుల్లోనే ఇరువురి ఆత్మ‌హ‌త్య‌..ఏంటీ మిస్ట‌రీ..

|

Jun 21, 2020 | 2:33 PM

ప్రేమ‌కు ఎటువంటి బేధాలు, బేష‌జాలు లేవు. ఎప్పుడు, ఎక్కడ‌, ఎవ‌రిపైనా అయిన ప్రేమ క‌ల‌గ‌వచ్చు. అలాగే హిజ్రాను మ‌న‌సారా ప్రేమించాడు ఓ యువకుడు.

హిజ్రాతో ప్రేమ‌, స‌హ‌జీవ‌నం..నెల రోజుల్లోనే ఇరువురి ఆత్మ‌హ‌త్య‌..ఏంటీ మిస్ట‌రీ..
Follow us on

ప్రేమ‌కు ఎటువంటి బేధాలు, బేష‌జాలు లేవు. ఎప్పుడు, ఎక్కడ‌, ఎవ‌రిపైనా అయిన ప్రేమ క‌ల‌గ‌వచ్చు. అలాగే హిజ్రాను మ‌న‌సారా ప్రేమించాడు ఓ యువకుడు. పెద్దల అంగీకారం ద‌క్క‌పోయేస‌రికి నెలరోజుల క్రితం వేరే ఇళ్లు తీసుకోని సహజీవనం చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే శనివారం ఉరివేసుకుని వారిద్ద‌రూ ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది.

పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం.. కారైక్కాల్ ద‌గ్గ‌ర్లోని తిరునల్లారుకు చెందిన దిలీప్‌ (26) అనే యువకునికి నిరావీ ఏరియాకు చెందిన షివానీ (30) అనే హిజ్రాకు మధ్య ఆరునెలల క్రితం ప‌రిచయం ఏర్పడింది. కొద్ది రోజుల్లోనే అది కాస్తా ప్రేమగా మారింది. ఒక‌రిని విడిచి మ‌రొక‌రు ఉండ‌లేనంత‌గా వారి మ‌ధ్య ప్రేమ బ‌ల‌ప‌డింది. ఈ ప్రేమ వ్యవహారం దిలీప్ కుటుంబ స‌భ్యుల‌కు తెలియ‌డంతో..ప‌ద్ద‌తి మార్చుకోవాల‌ని అత‌డికి వార్నింగ్ ఇచ్చారు. అయితే షివానీపై ప్రేమను వదులుకోవ‌డానికి స‌సేమేరా అన్న‌ దిలీప్..‌ నెలరోజుల క్రితం ఇల్లు వదిలి వెళ్లి కారైక్కాల్‌ ఒడుదురై ఏరియాలో షివానీతో స‌హ‌జీవ‌నం చేయ‌డం మొద‌లెట్టాడు.

ఇంతలా ప్రేమించుకున్నారు. పెద్ద‌ల‌ను ఎదిరించి మ‌రీ ఒక్క‌ట‌య్యారు. అయితే ఏం జ‌రిగిందే ఏమో తెలియదు కానీ శనివారం ఇద్దరూ ఇంటిలో ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నారు. దీనిపై కేసు న‌మోదు చేసిన‌ పోలీసులు ప‌లు కోణాల్లో విచార‌ణ జ‌రుపుతున్నారు.