సెల్యూట్ చేయాల్సిందే..అమర జవాన్లకు గుడి కట్టారు..

|

Jan 27, 2020 | 5:01 PM

దేవుళ్లకు గుడులు ఉండటం కామన్.. కొన్ని చోట్ల హీరోయిన్లకు, హీరోలకు, రాజకీయ నాయకులకు కూడా గుడులు ఉన్నాయ్. కానీ దేశం కోసం నిరంతరం శ్రమించే, జాతి రక్షణ కోసం కాపుకాసే జవాన్లకు గుడులు ఉండటం ఎక్కడైనా చూశారా..? యస్ అటువంటి గుడినే ఇప్పుడు మీకు పరిచయంబోతున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో.. దేశప్రతిష్ఠను పెంచిన సైనికులకు, అమరవీరుల కోసం ఓ ఆలయాన్ని ఏర్పాటు చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన  దాదాపు 50 మంది అమర […]

సెల్యూట్ చేయాల్సిందే..అమర జవాన్లకు గుడి కట్టారు..
Follow us on

దేవుళ్లకు గుడులు ఉండటం కామన్.. కొన్ని చోట్ల హీరోయిన్లకు, హీరోలకు, రాజకీయ నాయకులకు కూడా గుడులు ఉన్నాయ్. కానీ దేశం కోసం నిరంతరం శ్రమించే, జాతి రక్షణ కోసం కాపుకాసే జవాన్లకు గుడులు ఉండటం ఎక్కడైనా చూశారా..? యస్ అటువంటి గుడినే ఇప్పుడు మీకు పరిచయంబోతున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో.. దేశప్రతిష్ఠను పెంచిన సైనికులకు, అమరవీరుల కోసం ఓ ఆలయాన్ని ఏర్పాటు చేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన  దాదాపు 50 మంది అమర సైనికులు విగ్రహాలను అక్కడ ప్రతిష్ఠించారు. ఆ గుడికి ‘భారత సేవకుల ఆలయం’గా పేరు పెట్టారు.

భారతదేశ మొట్టమొదటి సైన్యాధ్యక్షడు కె.ఎం. కరియప్ప, వాయుసేన మాజీ అధిపతి అర్జున్​ సింగ్, మొదటి ఫీల్డ్​ మార్షల్​ జనరల్​ సామ్​ మనేక్షా లాంటి ఎందరో ప్రముఖుల విగ్రహాలు అక్కడ కొలువుదీరాయి. భారత ఆర్మీ యొక్క వెలకట్టలేని త్యాగాలకు చిహ్నంగా మాజీ న్యాయమూర్తి దాన్ సింగ్ చౌదరి ఈ ఆలయాన్ని కట్టించారు. ఆయన ఇప్పుడు పరమపదించినా, ఆయన రగిలించిన స్ఫూర్తి మాత్రం కొనసాగుతూనే ఉంది. ఆలయ పూజారి నిరంతరం అమరవీరులకు పూజలు చేస్తున్నారు. అనేకమంది ప్రజలు కూడా అక్కడికి వచ్చివెళ్తూ ఉంటారు. ఏది ఏమైనా ఇంత గొప్పగా ఆలోచించిన దాన్ సింగ్‌కి నిజంగా సెల్యూట్ చేయాల్సిందే.