పులికి, మనిషి మధ్య ఒక్క క్షణం గ్యాప్ .. ఏం జరిగింది ?

మహారాష్ట్రలోని భండారా జిల్లాలో జరిగిందీ అనూహ్య ఘటన.. అక్కడి పొలాల్లో చొరబడిన ఓ పులి స్థానికులను, రైతులను వణికించేసింది. దాన్ని చూసి భయపడి పారిపోతున్న వారిలో ఒకడి వెంట బడింది. ఇక తన పని అయిపోయిందనుకున్న ఆ వ్యక్తి చటుక్కున కింద బోర్లా పడుకుని.. ఊపిరి బిగబట్టి చచ్చినట్టే పడుకుండిపోయాడు. ఆలోగా ఆ క్రూర మృగం అతడిపై దాడికి రెడీగానా అన్నట్టు అతడి వద్దే కొన్ని క్షణాలపాటు కూచుంది. పారిపోతున్న వాళ్లంతా  కొద్దిసేపు ఆగి.. అది చూసి […]

పులికి, మనిషి మధ్య ఒక్క క్షణం గ్యాప్ .. ఏం జరిగింది ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 27, 2020 | 4:57 PM

మహారాష్ట్రలోని భండారా జిల్లాలో జరిగిందీ అనూహ్య ఘటన.. అక్కడి పొలాల్లో చొరబడిన ఓ పులి స్థానికులను, రైతులను వణికించేసింది. దాన్ని చూసి భయపడి పారిపోతున్న వారిలో ఒకడి వెంట బడింది. ఇక తన పని అయిపోయిందనుకున్న ఆ వ్యక్తి చటుక్కున కింద బోర్లా పడుకుని.. ఊపిరి బిగబట్టి చచ్చినట్టే పడుకుండిపోయాడు. ఆలోగా ఆ క్రూర మృగం అతడిపై దాడికి రెడీగానా అన్నట్టు అతడి వద్దే కొన్ని క్షణాలపాటు కూచుంది. పారిపోతున్న వాళ్లంతా  కొద్దిసేపు ఆగి.. అది చూసి హడలిపోయారు. ఇక అతడి పని ఖతం అనుకున్నారు. అయితే ఏమైతేనేం.. అతడి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ బాగానే పని చేసింది. అతగాడు మరణించాడనుకుందో.. లేక రైతుల కేకల వల్లో.. ధైర్యం చేసి కర్రలు పట్టుకుని తనవద్దకు పరుగులు తీసి వస్తున్నవారిని చూసో.. అక్కడి నుంచి లేచి పులి తాను కూడా పరుగు తీసింది. చచ్చినట్టు పడుకున్న వ్యక్తి క్షేమంగా లేచి కూర్చున్నాడు. అటు-పులి ఇటు మనిషి ‘ ఇద్దరూ ‘ సేఫ్ ! ఒళ్ళు గగుర్పొడిచే  ఈ వీడియోను ఓ అటవీ అధికారి షేర్ చేశారు.