గుంటూరులో కలకలం..గోనె సంచిలో మృతదేహం
గుంటూరు నేషనల్ హైవేపై కలకలం చెలరేగింది. సత్యసాయి ట్రస్ట్ ఎదుట ఉన్న మురుగు కాల్వలో ఓ డెడ్ బాడీ స్థానికులు కంటపడింది.
గుంటూరు నేషనల్ హైవేపై కలకలం చెలరేగింది. సత్యసాయి ట్రస్ట్ ఎదుట ఉన్న మురుగు కాల్వలో ఓ డెడ్ బాడీ స్థానికులు కంటపడింది. వెంటనే వారు నల్లపాడు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణ అనంతరం మృతుడు పిడుగురాళ్లకు చెందిన మోదుగుల పూర్ణచంద్రరావు(39)గా గుర్తించారు.
గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసి మృతదేహాన్ని గోనెసంచిలో పెట్టి కాలువలో పడేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు పూర్ణచంద్రరావు పురుగు మందుల వ్యాపారం చేస్తుంటాడని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.