Crores in Pension Account: ఆ రైతు పెన్షన్ ఖాతాలోకి డబ్బుల వర్షం.. తర్వాత ఏమైందో తెలుసా?

మీరు ఏటీఎంకు డబ్బులు తీసుకోవడానికి వెళ్లారు. మీ బేలెన్స్ చెక్ చేశారు. మీకు బ్యాంకులో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ బేలెన్స్ కనిపించింది. అదీ కొట్లలో.. వెంటనే మీరేమి చేస్తారు?

Crores in Pension Account: ఆ రైతు పెన్షన్ ఖాతాలోకి డబ్బుల వర్షం.. తర్వాత ఏమైందో తెలుసా?
Bihar Farmer Bank Account
Follow us

|

Updated on: Sep 17, 2021 | 7:03 PM

Crores in Pension Account:  మీరు ఏటీఎంకు డబ్బులు తీసుకోవడానికి వెళ్లారు. మీ బేలెన్స్ చెక్ చేశారు. మీకు బ్యాంకులో ఉండాల్సిన దానికన్నా ఎక్కువ బేలెన్స్ కనిపించింది. అదీ కొట్లలో.. వెంటనే మీరేమి చేస్తారు? ముందు ఖంగు తింటారు. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తారు. అప్పుడు కూడా అంతే కోట్లాది రూపాయలు బేలెన్స్ కనిపించింది. అప్పుడు ఏమవుతుంది? అదేమో కానీ, బీహార్ లో ఒక వృద్దుడికి ఇలానే జరిగింది. అతని పెన్షన్ ఖాతాలోకి అకస్మాత్తుగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 52 కోట్లు వచ్చి పడ్డాయి.  దీంతో అతనికి మతి పోయినంత పని అయింది. సరే, ఎలానూ అది పొరపాటుగా తనకు వచ్చి ఉంటుందని తెలుసు. ఇప్పుడు ఆ వృద్ధుడు బ్యాంకును ఏమడిగాడో తెలుసా? ”ఈ మొత్తంలో కొంత మొత్తాన్ని నాకు అందించండి. దీంతో జీవితాంతం సాఫీగా నా బతుకు సాగిపోతుంది.” నిజమే.. కదూ.. పొరపాటునో.. గ్రహపాటునో అలా ఎదో ఒకరూపంలో కొంత సొమ్ము అందితే, అటువంటి నిస్సహాయ వృద్ధులు హాయిగా బతికేస్తారు. సరే, ఇది పక్కన పెడితే, అసలు ఈ 52 కోట్ల లావాదేవీకి సంబంధించిన పూర్తీ వివరాలు తెలుసుకుందాం.

ముజఫర్‌పూర్ జిల్లాలోని కటిహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన రామ్ బహదూర్ షా తన ఖాతాలోకి రూ .52 కోట్లకు పైగా జమ అయ్యాయని కస్టమర్ సర్వీస్ పాయింట్ (CSP) అధికారి చెప్పడంతో ఉలిక్కి పడ్డాడు. ఈ  విషయం కనుగొన్న తర్వాత ఆ వ్యక్తి , అధికారి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. 

రామ్ బహదూర్ షా అనే రైతు, తన పెన్షన్ అకౌంట్ చెక్ చేసుకోవడానికి సమీపంలోని CSP అధికారిని కలిశానని చెప్పాడు. అతను తన ఆధార్ కార్డును సమర్పించి, ధృవీకరణ కోసం వేలిముద్ర వేశాడు. అప్పుడు అతని ఖాతాలో బ్యాలెన్స్ రూ. 52 కోట్లకు పైగా ఉంది. ఇది విని ఆ వృద్ధుడు ఆశ్చర్యపోయాడు.   ఆ మొత్తం ఎక్కడ నుండి వచ్చింది అని కంగారు పడ్డాను అని  రామ్ బహదూర్ షా అన్నారు.

“మేము వ్యవసాయంతో మా జీవితాలను గడుపుతున్నాము. ఈ మొత్తంలో కొంత మొత్తాన్ని ఇవ్వమని నేను ప్రభుత్వానికి మాత్రమే విజ్ఞప్తి చేస్తున్నాను. తద్వారా మా  జీవితాంతం సాఫీగా గడపవచ్చు.” అంటూ అధికారికి చెప్పాడు. 

ఇంతకీ ఇంత సొమ్ము ఎలా ఇతని ఎకౌంట్ లోకి వచ్చిందో తెలియలేదు. దీంతో ఆ బ్యాంకు అధికారి పోలీసులకు విషయాన్ని చెప్పాడు. కట్రా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ మనోజ్ పందర్ ఈ విషయంపై ఇలా చెప్పారు. ” ఈ సొమ్ము ఎలా వచ్చిందో తెలీదు. ఈ విషయంపై స్థానిక అధికారులకు తెలియజేశాము. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తారు. అతనికి [రామ్ బహదూర్ షా] ఉన్న సంబంధిత బ్యాంక్ అధికారిని ప్రశ్నిస్తారు.” అని తెలిపారు.

అదీ విషయం. ఇటీవల కాలంలో బీహార్ లో ఇలా సామాన్యుల ఖాతాల్లోకి పెద్ద ఎత్తున డబ్బులు జమ అవుతుండడం తరుచు జరుగుతూ వస్తోంది. ఇంతకుముందు, రాష్ట్రంలోని కటిహార్ జిల్లాలోని ఇద్దరు పాఠశాల విద్యార్థులు వారి ఖాతాలలో రూ .900 కోట్లకు పైగా ఉన్నట్లు తెలిసింది. అదేవిధంగా బీహార్‌లోని ఖగారియా నుంచి మరో కేసు నమోదైంది. అక్కడ బ్యాంక్ తప్పు కారణంగా ఒక నివాసి తన ఖాతాలో 5.50  లక్షలు అందుకున్నాడు . ప్రధాని నరేంద్రమోదీ ఆర్థిక సహాయంగా పంపినట్లు చెబుతూ ఆ డబ్బును వెనక్కి ఇవ్వడానికి ఆ వ్యక్తి నిరాకరించాడు. 

ఇవి కూడా చదవండి:

Vaccine Fake Certificate: టెలిగ్రాం వేదికగా నకిలీ కరోనా టీకా సర్టిఫికెట్ల జోరు.. చెక్ పాయింట్ నివేదికలో వెల్లడి!

Elon Musk Space X: మరోచరిత్ర సృష్టించిన ఎలోన్ మస్క్..అంతరిక్షంలోకి సామాన్యులను చేర్చిన స్పేస్ ఎక్స్