తిరుమలలో చిరుత సంచారం.. సీసీ కెమెరాలో దృశ్యాలు

తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో తిరుమల కొండపై ఐదు నెలలుగా భక్తుల రద్ధీ తగ్గింది. టీటీడీ అధికారులు కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు.

తిరుమలలో చిరుత సంచారం.. సీసీ కెమెరాలో దృశ్యాలు

Updated on: Sep 02, 2020 | 5:48 PM

తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో తిరుమల కొండపై ఐదు నెలలుగా భక్తుల రద్ధీ తగ్గింది. టీటీడీ అధికారులు కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. దీంతో తిరుమల వీధులన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. జనసంచారం లేకపోవడంతో శేషాచల అటవీ ప్రాంతంలోని వణ్య ప్రాణులు తిరుమలలోకి ప్రవేశిస్తున్నాయి.

ఇప్పటికే పలుమార్లు రాత్రి సమయాల్లో చిరుతలు, ఎలుగుబంట్లు బయటకు వస్తున్నట్లు తిరుమలలోని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా మంగళవారం రాత్రి చిరుత సంచరించినట్లు అధికారులు గుర్తించారు. రాత్రి 10.30 నుంచి 11 గంటల ప్రాంతంలో చిరుత సంచరించినట్లు నిర్దారించారు.

పశ్చిమ మాఢవీధికి సమీపంలో ఉన్న మ్యూజియం వద్ద చిరుత కాసేపు కనిపించింది. మ్యూజియం గోడపై ఉన్న సీసీ కెమెరాలో చిరుత కదలికలు కనిపించాయి.. కాసేపటి తర్వాత అడవిలోకి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ టీవీ ఫుటేజీలో చూసిన అధికారులు నిర్దారించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us