కేరళలో భారీగా నమోదైన కరోనా కేసులు.. ఇవాళ ఒక్కరోజే..

| Edited By:

May 28, 2020 | 5:54 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ క్రమంలో కేరళలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి

కేరళలో భారీగా నమోదైన కరోనా కేసులు.. ఇవాళ ఒక్కరోజే..
Follow us on

Coronavirus In Kerala: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ క్రమంలో కేరళలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కేరళకు తిరిగొచ్చిన వారితో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. గురువారం కొత్తగా 84 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు సీఎం పినరయ్ విజయన్ ప్రకటించారు. కేరళలో ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

కాగా.. కేరళలో ఇప్పటివరకూ 1,088 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 526. గురువారం నమోదైన 84 కరోనా పాజిటివ్ కేసుల్లో 48 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారని, 31 మంది విదేశాల నుంచి వచ్చిన వారని, మరో ఐదుగురికి ఇతరుల ద్వారా కరోనా సోకినట్లు సీఎం తెలిపారు. ముగ్గురు కరోనా నుంచి కోలుకుని గురువారం డిశ్చార్జ్ అయినట్లు సీఎం ప్రకటించారు.

Also Read: మనసున్న రైతు.. వ‌ల‌స కూలీలకు విమాన టిక్కెట్లు..!