దేశ రాజధానిలో ఘనంగా 73వ ఆర్మీ దినోత్సవం, సైనిక సిబ్బంది, వారి కుటుంబసభ్యులకు రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ శుభాకాంక్షలు

|

Jan 15, 2021 | 11:04 AM

దేశరాజధానిలో 73వ ఆర్మీ దినోత్సవం ఘనంగా జరుగుతోంది. ఆర్మీడే పురస్కరించుకుని అధికారులు, సైనికులు, సిబ్బంది,..

దేశ రాజధానిలో ఘనంగా 73వ ఆర్మీ దినోత్సవం, సైనిక సిబ్బంది, వారి కుటుంబసభ్యులకు రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ శుభాకాంక్షలు
Follow us on

దేశరాజధానిలో 73వ ఆర్మీ దినోత్సవం ఘనంగా జరుగుతోంది. ఆర్మీడే పురస్కరించుకుని అధికారులు, సైనికులు, సిబ్బంది, వారి కుటుంబాలు, మాజీ సైనికులకు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. “భారత సైన్యానికి చెందిన పరాక్రమ పురుషులు, మహిళలకు శుభాకాంక్షలు” అంటూ రాష్ట్రపతి ట్వీట్‌ చేశారు. “దేశ సేవలో చేసిన త్యాగాలను, ధైర్య సాహసాలను గుర్తుంచుకుంటాము, సైనికులు, వారి కుటుంబాలకు దేశం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుంది” అని రాష్ట్రపతి తెలిపారు. ఇక, ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌ ద్వారా ఆర్మీ డే శుభాకాంక్షలు చెప్పారు. “దేశ సైన్యం బలమైందని, ధైర్యమైందనది.. సైన్యం ఎప్పుడూ దేశాన్ని గర్వించేలా చేస్తుంది. దేశ ప్రజలందరి తరఫున తాను భారత సైన్యానికి వందనం చేస్తున్నాను” అంటూ మోదీ ట్వీట్‌ చేశారు.