తెలంగాణలో కరోనా కల్లోలం.. ఒక్క రోజే 730 పాజిటివ్ కేసులు..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో ఇవాళ కొత్తగా 730 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

తెలంగాణలో కరోనా కల్లోలం.. ఒక్క రోజే 730 పాజిటివ్ కేసులు..

Edited By:

Updated on: Jun 21, 2020 | 9:49 PM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో ఇవాళ కొత్తగా 730 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 7,802కి చేరింది. ఇందులో 3,861 యాక్టివ్ కేసులు ఉండగా..3,731 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 210 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు జిహెచ్ఎంసి పరిధిలో659, జనగాం 34, రంగారెడ్డి 10, మేడ్చల్ 9, వరంగల్ 6, ఆసిఫాబాద్ 3, సంగారెడ్డి, ఆదిలాబాద్, కొత్తగూడెం, నారాయణపేట, మెదక్, నల్గొండ, వికారాబాద్, వరంగల్, యాదాద్రిలో ఒక్కో పాజిటివ్ కేసు నమోదు అయింది.