
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బలరాం పూర్ జిల్లా శంకర్‌ఘడ్‌లో పెళ్లి వ్యాన్ బోల్తా పడింది. ఈ ఘటనలో 8 మంది దుర్మరణం చెందగా.. 13 మందికిపైగా గాయపడినట్టు సమాచారం. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో దాదాపు 40 మంది ప్రయాణం చేస్తున్నారని సమాచారం. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం అంబికాపూర్ తరలించారు.
వీరంతా పెళ్లి వేడుక కోసం వ్యాన్‌లో బుల్సీ నుంచి అమేరా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ధరాగావ్ వద్ద ఈ యాక్సిడెంట్ జరిగిందని బలరాంపూర్ జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రమాదం జరిగిన అరగంట వరకు అంబులెన్స్ ఘటనాస్థలికి రాలేదని, దీంతో నిండు ప్రాణాలు బలయ్యాయని స్థానికులు చెబుతున్నారు.
Chhattisgarh: A pickup van overturned in Amera village of Balrampur district late last night, leaving 8 dead and 16 injured. Additional SP, Surguja says, "7 people died on spot, 1 was brought dead at hospital. Passengers say that driver had consumed alcohol. Investigation is on." pic.twitter.com/RJfbn2eIJW
— ANI (@ANI) April 26, 2019