తెలంగాణలో కరోనా టెర్రర్.. ఒక్క రోజే 546 పాజిటివ్ కేసులు..

| Edited By:

Jun 20, 2020 | 10:43 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో ఇవాళ కొత్తగా 546 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

తెలంగాణలో కరోనా టెర్రర్.. ఒక్క రోజే 546 పాజిటివ్ కేసులు..
Follow us on

Coronavirus in Telangana: కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో ఇవాళ కొత్తగా 546 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 7072కి చేరింది. ఇందులో 3363 యాక్టివ్ కేసులు ఉండగా.. 3506 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 203 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు జిహెచ్ఎంసి పరిధిలో458, రంగారెడ్డి 50, మేడ్చల్ 6, మహబూబ్ నగర్ 3, ఖమ్మం 2, కరీంనగర్ 13, వరంగల్ అర్బన్ 1, వరంగల్ రూరల్ 2, జనగామ 10, ఆదిలాబాద్ 1 కేసులు నమోదయ్యాయి.:

Also Read: కరోనా కట్టడకోసం ‘కఫసుర’.. ఐదు రోజుల్లోనే..