భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదుగురు మావోయిస్టుల అరెస్ట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదుగురు మావోయిస్టుల అరెస్ట్

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని చర్ల మండలంలో ఐదుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టు అగ్రనేత ఆజాద్ దళంలో పని చేస్తున్న ఐదుగురు దళ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఈ విషయాన్ని వెల్లడించారు. పట్టుబడ్డ మావోయిస్టులను పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు జిల్లా సరిహద్దు చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా బాసగుడా పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా […]

TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Mar 30, 2019 | 6:42 PM

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని చర్ల మండలంలో ఐదుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టు అగ్రనేత ఆజాద్ దళంలో పని చేస్తున్న ఐదుగురు దళ సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఈ విషయాన్ని వెల్లడించారు. పట్టుబడ్డ మావోయిస్టులను పోలీసులు విచారిస్తున్నారు.

మరోవైపు జిల్లా సరిహద్దు చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా బాసగుడా పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయుటపల్లి-కొరసాగుడా గ్రామాల అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం సీఆర్పీఎఫ్ 168 బెటాలియన్ పోలీసులు సంఘటన స్థలంలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu