లాక్‌డౌన్‌లో మార్నింగ్ వాక్.. డ్రోన్ సాయంతో అరెస్ట్!

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. కరోనాను నియంత్రించడం కోసం

లాక్‌డౌన్‌లో మార్నింగ్ వాక్.. డ్రోన్ సాయంతో అరెస్ట్!
Follow us

| Edited By:

Updated on: Apr 04, 2020 | 7:58 PM

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. కరోనాను నియంత్రించడం కోసం ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ప్రజలను రోడ్లపైకి రావొద్దని ప్రభుత్వం ఆదేశించింది. కానీ కొంతమంది ఇవేమీ పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారిని పట్టుకోవడం కోసం కేరళ పోలీసులు టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారు. డ్రోన్‌లు ఉపయోగించి, రోడ్లపైకి వస్తున్న వారిని గుర్తిస్తున్నారు.

కాగా.. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం మార్నింగ్ వాక్ చేయడానికి బయటకు వచ్చిన 40మంది ఈ డ్రోన్ల కళ్లకు చిక్కారు. ఈ విషయం తెలియగానే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ 40 మందినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఎర్నాకులంలో సంభవించింది. పోలీసులు అరెస్టు చేసిన వారంతా.. ఆ తర్వాత బెయిలుపై విడుదలయ్యారు. మళ్లీ ఇలాంటి పనులు చేయొద్దని వారిని పోలీసులు హెచ్చరించారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘింస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు పేర్కొన్నారు.

రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..