హైవేపై ఆవును ఢీకొట్టి కారు.. నలుగురు దుర్మరణం

లక్నో :హైవేపై అడ్డంగా వచ్చిన ఓ ఆవును అతివేగంగా వస్తున్న ఓ కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బాదేలియా గ్రామం వద్ద సీతాపూర్‌ – లఖీంపూర్‌ హైవేపై చోటు చేసుకుంది. ఓ పెళ్లి ఫంక్షన్‌కు వెళ్లిన పదకొండు మంది తిరిగి తమ స్వగ్రామానికి వస్తుండగా.. వారి కారుకు ఎదురుగా ఆవు వచ్చింది. దీంతో డ్రైవర్‌ అదుపుతప్పి ఆవును ఢీకొట్టడంతో కారు బొల్తా […]

హైవేపై ఆవును ఢీకొట్టి కారు.. నలుగురు దుర్మరణం

Edited By:

Updated on: Mar 08, 2019 | 4:12 PM

లక్నో :హైవేపై అడ్డంగా వచ్చిన ఓ ఆవును అతివేగంగా వస్తున్న ఓ కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బాదేలియా గ్రామం వద్ద సీతాపూర్‌ – లఖీంపూర్‌ హైవేపై చోటు చేసుకుంది. ఓ పెళ్లి ఫంక్షన్‌కు వెళ్లిన పదకొండు మంది తిరిగి తమ స్వగ్రామానికి వస్తుండగా.. వారి కారుకు ఎదురుగా ఆవు వచ్చింది. దీంతో డ్రైవర్‌ అదుపుతప్పి ఆవును ఢీకొట్టడంతో కారు బొల్తా పడింది. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అక్కడికక్కడే నలుగురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఏడుగురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను సావిత్రి(35), కిరణ్‌(30), నీతు(15), మోహిని(14)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను జిల్లా ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచి బంధువులకు సమాచారమిచ్చారు.