యూకే నుంచి తెలంగాణకు 358 మంది ప్రయాణికులు..గుర్తించేపనిలో ఆరోగ్యశాఖ అధికారులు..

యూకేలో కొత్త వైరస్‌ స్ట్రెయిన్‌ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యామయ్యాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. కొత్త రకం వైరస్‌ విషయంపై కేంద్రం కీలక సూచనలు..

యూకే నుంచి తెలంగాణకు 358 మంది ప్రయాణికులు..గుర్తించేపనిలో ఆరోగ్యశాఖ అధికారులు..

Updated on: Dec 22, 2020 | 5:39 PM

యూకేలో కొత్త వైరస్‌ స్ట్రెయిన్‌ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యామయ్యాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. కొత్త రకం వైరస్‌ విషయంపై కేంద్రం కీలక సూచనలు చేసిందని తెలంగాణ ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. అయితే ఇప్పటికే శంషాబాద్‌లో ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు అప్రమత్తమయ్యారని వెల్లడించారు.

సోమవారం యూకే నుంచి ఏడుగురు ప్రయాణికులు తెలంగాణకు వచ్చారని తెలిపారు. గత వారం రోజుల్లో బ్రిటన్‌ నుంచి 358 మంది తెలంగాణకు వచ్చారని, వారికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు శ్రీనివాసరావు వెల్లడించారు. ఆ తర్వాత ఏమైన వ్యాధి లక్షణాలు ఉంటే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని కోరారు. వారి వివరాలను తీసుకునే పనిలో ఆరోగ్య శాఖ ఉందని అన్నారు.

తెలంగాణలో కొత్త వైరస్‌ ప్రభావం లేదని.. ఎవరూ ఆందోళన చెందవద్దని శ్రీనివాసరావు పేర్కొన్నారు. వైరస్‌లో మార్పులు సహజమని… పరిస్థితిని నిరంతరం అధ్యయనం చేస్తున్నామన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉందని తెలిపారు.