దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగే పరేడ్‌లో పాల్గొనే 350 మంది పోలీసులను ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా క్వారంటైన్‌లో ఉంచారు. కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు ఢిల్లీ కంటోన్‌మెంట్ లోని పోలీస్ క్వాటర్స్‌లో వారిని ఉంచినట్లు స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సాయుధ పోలీసు) రాబిన్ హిబు తెలిపారు.
భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పంద్రాగస్టు వేడుకలను నిరాడంబరంగా జరుపనున్నారు. ఈ నేపథ్యంలో ఎర్రకోట వద్ద జాతీయ పతాకం ఆవిష్కరణకు కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించే అవకాశమున్నది.
Read More:
30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు.. తొలి దశలో 15 లక్షల ఇళ్లు..!
ఆదుకున్న రబీ దిగుబడి.. రాష్ట్రానికి తప్పిన ఆహార ఇబ్బందులు..!