
దేశ రాజధానిని కరోనావైరస్ వెంటాడుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రభుత్వ లెక్కలు ప్రకారం.. శనివారం మరో 186 మందికి కరోనా సోకగా .. ఒకరు ప్రాణాలు విడిచారు. ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య మొత్తం కేసుల సంఖ్య 1893కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 43 మంది ప్రాణాలు విడిచారు. జహంగీర్‌పురీలో ఒక్కరి నుంచి… కుటుంబంలోని 31 మందికి కోవిడ్ సోకడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఉత్తర దిల్లీ జహంగీర్‌పురీలో నివసిస్తున్న ఓ ఫ్యామిలిలో 31 మందికి కోవిడ్ సోకింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. కోవిడ్ సోకిన కుటుంబ సభ్యులందరినీ ప్రస్తుతం నరేలాలోని సెల్ఫ్ ఐసోలేషన్ సెంటర్ లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒక మహిళ నుంచే వీరందిరికీ కోవిడ్ సోకినట్లు పేర్కొన్నారు. అయితే.. వీరెవరికీ వైరస్ సింటమ్స్ భయటపడలేదని అధికారులు పేర్కొవడం గమనార్హం.
”జహంగీర్‌పురీలో ఏప్రిల్ 8న ఓ మహిళ ప్రాణాలు విడిచింది. ఏప్రిల్ 10న చేసిన కరోనా టెస్టుల్లో ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఆమె ఫ్యామిలీలోని 26 మందికి శుక్రవారమే కరోనా పాజిటివ్ అని తేలగా… శనివారం మరో ఐదుగురు వ్యాధి బారినపడ్డారు. ఇందులో చిన్నపిల్లలూ ఉన్నారు” అని సీనియర్ అధికారి పేర్కొన్నారు.