రాజమండ్రి జైల్లో ఖైదీలకు ఎయిడ్స్.. హైకోర్టు ఆగ్రహం..

| Edited By:

Aug 01, 2019 | 12:57 PM

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 27 మంది ఖైదీలు ఎయిడ్స్‌తో బాధపడుతున్నట్లు తెలుసుకున్న హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జైల్లోకి రాకముందే ఈ ఖైదీలకు ఎయిడ్స్ వుందా..? జైల్లోకి వచ్చాక ఎయిడ్స్ బారిన పడ్డారా..? అనే విషయాలపై పూర్తి వివరణ ఇవ్వాలని కోరింది. అసలు ఖైదీలకు వైద్య పరీక్షలు చేయకుండా ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా ఎంతమందికి ఎయిడ్స్ ఉందో తేల్చాలని జైలు అధికారులకు సూచించింది. దీనిపై తదుపరి విచారణను ఈనెల 2కి వాయిదా వేసింది. […]

రాజమండ్రి జైల్లో ఖైదీలకు ఎయిడ్స్.. హైకోర్టు ఆగ్రహం..
Follow us on

రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 27 మంది ఖైదీలు ఎయిడ్స్‌తో బాధపడుతున్నట్లు తెలుసుకున్న హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జైల్లోకి రాకముందే ఈ ఖైదీలకు ఎయిడ్స్ వుందా..? జైల్లోకి వచ్చాక ఎయిడ్స్ బారిన పడ్డారా..? అనే విషయాలపై పూర్తి వివరణ ఇవ్వాలని కోరింది. అసలు ఖైదీలకు వైద్య పరీక్షలు చేయకుండా ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంకా ఎంతమందికి ఎయిడ్స్ ఉందో తేల్చాలని జైలు అధికారులకు సూచించింది. దీనిపై తదుపరి విచారణను ఈనెల 2కి వాయిదా వేసింది. ఆ రోజున పూర్తి వివరాలతో తమ ముందు హాజరుకావాలని రాజమండ్రి జైలు సూపరింటెండెంట్‌కు స్పష్టం చేసింది. రాజమండ్రి జైలులో జీవిత ఖైదుగా ఉంటున్న గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి తనకు ఎయిడ్స్ ఉందని, బెయిల్ ఇస్తే ఇంటి వద్ద కొన్ని రోజులు వైద్యం చేయించుకుంటానని హైకోర్టును ఆశ్రయించడంతో అసలు కథ బయటపడింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న హైకోర్టు అసలు జైలులో ఎంతమంది ఖైదీలు ఉన్నారని ఆరా తీసింది. ఇంతమంది ఎయిడ్స్‌తో బాధ పడుతుంటే జైలు అధికారులు ఏం చేస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. జైలులోకి వచ్చాక వీరికి ఎయిడ్స్ సోకిందని రిపోర్టుల్లో తేలితే.. జైలు సూపరింటెండెంట్‌ పై చర్యలు తప్పవని హెచ్చరించింది.