Inmates of Ludhiana Central Jail: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచదేశాలను వణికిస్తోంది. పంజాబ్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా, లుధియానాలోని సెంట్రల్ జైలులో 26 మంది ఖైదీలు కరోనా మహమ్మారి బారినపడ్డారు. దీంతో అప్రమత్తమైన జైలు అధికారులు వారిని ప్రత్యేక బ్యారక్‌లో ఉంచి ఇతర ఖైదీలతో కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే, వారి కాంటాక్ట్‌లను ట్రేసింగ్ చేస్తున్నారు.
కాగా.. జైల్లో ఉన్న ఖైదీలకు కరోనా ఎలా సోకిందన్న దానిపై ఆరా తీస్తున్నట్టు లుధియానా చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజేశ్ కుమార్ బగ్గా తెలిపారు. కాగా, పంజాబ్‌లో ఇప్పటి వరకు 6,109 కేసులు నమోదు కాగా, 1,641 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 4,306 మంది కోలుకోగా, 162 మంది కరోనా కాటుకు బలయ్యారు.