కర్ణాటకలో కొత్తగా 239 కరోనా పాజిటివ్ కేసులు..

| Edited By:

Jun 07, 2020 | 6:23 PM

లాక్ డౌన్ సడలింపులతో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కర్ణాటకలో కరోనా వ్యాప్తి పెరుగుతున్నది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 239 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు

కర్ణాటకలో కొత్తగా 239 కరోనా పాజిటివ్ కేసులు..
Follow us on

లాక్ డౌన్ సడలింపులతో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కర్ణాటకలో కరోనా వ్యాప్తి పెరుగుతున్నది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 239 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 5452కి పెరిగింది. కర్ణాటకలో ఇప్పటివరకు కరోనా వైరస్‌ వల్ల 61 మంది బాధితులు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 3,257 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 2132 మంది బాధితులు కోలుకున్నారు.

కాగా.. భారత్ లో ఇప్పటివరకు 2,46,628 కరోనా కేసులు నమోదవగా, 1,19,293 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ వైరస్‌ బారిన పడినవారిలో 1,20,406 మంది బాధితులు కోలుకోగా, 6929 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 9971 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్‌ కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులు ఇంత పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవడం ఇదే మొదటిసారి.

Also Read: విద్యుత్ బిల్లు.. వాయిదాల్లో కట్టొచ్చు.. కానీ..