ఫైజర్ టీకా ప్రయోగం… ఇద్దరికి సైడ్ ఎఫెక్ట్స్… అప్రమత్తంగా ఉండాలన్న యూకే ప్రభుత్వం…

| Edited By:

Dec 09, 2020 | 7:00 PM

ఫైజర్ టీకాను యూకో ప్రభుత్వం అత్యవసరమైన వారికి ప్రయోగాత్మకంగా అందిస్తోంది. ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి ఇప్పటికే టీకాను అందించడం ప్రారంభించింది.

ఫైజర్ టీకా ప్రయోగం... ఇద్దరికి సైడ్ ఎఫెక్ట్స్... అప్రమత్తంగా ఉండాలన్న యూకే ప్రభుత్వం...
Follow us on

2 people suffer side effects of Pfizer COVID-19 vaccine in UK, warning issued ఫైజర్ టీకాను యూకే ప్రభుత్వం అత్యవసరమైన వారికి ప్రయోగాత్మకంగా అందిస్తోంది. కోవిడ్ లక్షణాలు ఎక్కువ ఉన్న వ్యాధిగ్రస్తులకు, ఆస్పత్రల్లో పని చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి ఇప్పటికే టీకాను బ్రిటన్ ప్రభుత్వం అందించడం ప్రారంభించింది.

ఇద్దరికి సైడ్ ఎఫెక్ట్స్….

 

ఫైజర్ టీకాను బ్రిటన్ ఎన్‌హెచ్ స్టాఫ్ కు అందించగా… ఇద్దరికి సైడ్ ఎఫెక్ట్స్ బయటపడ్డాయి. స్పందించిన ప్రభుత్వం వెంటనే వారిని ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం ఆ ఇద్దరు కోలుకుంటున్నారని పేర్కొంది. అయితే ప్రయోగాత్మకంగా టీకా తీసుకున్న వారిలో దురద, వాంతులు, తలనొప్పి వంటి లక్షణాలు ఉన్న వారు వెంటనే ఆస్పత్రిలో చేరాలని సూచించింది. కాగా, ప్రభుత్వం ఫైజర్ టీకాను ఇప్పిటికే కరోనా లక్షణాలు ఉన్న వారు టీకాను తీసుకోవద్దని సూచిస్తోంది.