బెంగాల్‌లో ఘర్షణలు.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

| Edited By:

Jun 22, 2019 | 10:43 AM

సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి మొదలైన రాజకీయ ఘర్షణలు బెంగాల్‌లో ఇంకా కొనసాగుతున్నాయి. టీఎంసీ, బీజేపీల మధ్య చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోగా.. పలువురు టీఎంసీ కార్యకర్తలు కూడా చనిపోయారు. తాజాగా భట్ పరా ప్రాంతంలో జరిగిన ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలుకోల్పోయారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. శాంతి భద్రతలు అదుపులో వచ్చేందుకు 144 […]

బెంగాల్‌లో ఘర్షణలు.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
Follow us on

సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి మొదలైన రాజకీయ ఘర్షణలు బెంగాల్‌లో ఇంకా కొనసాగుతున్నాయి. టీఎంసీ, బీజేపీల మధ్య చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోగా.. పలువురు టీఎంసీ కార్యకర్తలు కూడా చనిపోయారు. తాజాగా భట్ పరా ప్రాంతంలో జరిగిన ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలుకోల్పోయారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. శాంతి భద్రతలు అదుపులో వచ్చేందుకు 144 సెక్షన్‌ను విధించారు. భట్ పరా, జగద్దర్ ప్రాంతాల్లో షాపులను అధికారులు మూసివేయించారు. అలాగే రాష్ట్రంలో పలు చోట్ల ముందస్తు చర్యల్లో భాగంగా ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. బెంగాల్‌లో జరుగుతున్న రాజకీయ ఘర్షణలపై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. కుట్రపూరితంగా ఈ దాడులు చేస్తోందని విమర్శలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా శాంతిని నెలకొల్పాల్సిన అవసరం ఉందని రాష్ట్ర గవర్నర్ అన్నారు.