ఫార్మా కంపెనీలో కరోనా కలకలం.. ప్లాంట్‌ మూసివేత..

దేశంలో కోవిద్-19 కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్, అంకలేశ్వర్‌లోని ప్రసిద్ధ ఔషధ తయారీ సంస్థ లుపిన్‌కు చెందిన తయారీ ప్లాంట్‌లో సిబ్బందికి కోవిడ్‌-19 పాజిటివ్‌ రావడంతో

ఫార్మా కంపెనీలో కరోనా కలకలం.. ప్లాంట్‌ మూసివేత..

Edited By:

Updated on: Jul 15, 2020 | 10:09 AM

Employees test positive at Lupin: దేశంలో కోవిద్-19 కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్, అంకలేశ్వర్‌లోని ప్రసిద్ధ ఔషధ తయారీ సంస్థ లుపిన్‌కు చెందిన తయారీ ప్లాంట్‌లో సిబ్బందికి కోవిడ్‌-19 పాజిటివ్‌ రావడంతో ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసివేసింది. లుపిన్‌ మందుల తయారీ కర్మాగారంలో 18మంది ఉద్యోగులకు కరోనా సోకింది. దీంతో ప్లాంట్‌ను మూసివేయాల్సి వచ్చింది. అయితే మిగిలిన ప్లాంట్లలోని ఉద్యోగులు కరోనాకు ప్రభావితం కాలేదని ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఎండీ మోడియా వెల్లడించారు.

సదరు ప్లాంట్ ను జూలై 12న మూసివేసామని, శానిటైజేషన్‌, ఐసోలేషన్‌ తదితర ప్రక్రియలను నిబంధనల ప్రకారం పాటిస్తున్నామని మోడియా తెలిపారు. బాధితులు వైద్య సంరక్షణలో ఉన్నారనీ, కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రోటోకాల్‌ పాటిస్తున్నామని లుపిన్‌ ప్రతినిధి తెలిపారు. అంకలేశ్వర్‌లో 40 ఎకరాలలో 11 తయారీ కర్మాగారాలను లుపిన్‌ కలిగి ఉంది.

Also Read: విట్,  ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీల బీటెక్‌ ప్రవేశపరీక్షలు రద్దు..!