హైదరాబాద్ మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. యాసీన్ హోటల్ ఎదురుగా చాంద్ అనే 17 సంవత్సరాల యువకుడ్ని, అజ్జు అనే మరో యువకుడు హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు స్నేహితుల మధ్య వివాదాలే కారణమని భావిస్తున్నారు. చాంద్ మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్ కి పోస్ట్ మార్టమ్ నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.