Somalia in extremist attack: సోమాలియాలో దారుణం చోటుచేసుకుంది. రాజధాని మొగదిషులోని ఓ హోటల్‌పై అల్‌ఖైదా అనుబంధ అల్-షబాబ్ సంస్థ ఉగ్రవాదులు ఆదివారం జరిపిన దాడిలో 10 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఉగ్రవాదులు తొలుత హోటల్ ముందు కారుబాంబును పేల్చివేశారు. అనంతరం హోటల్ లోపలికి వెళ్లి అందులో బసచేసిన వారిని బందీలుగా పట్టుకున్నారు.
అప్రమత్తమైన భద్రతాబలగాలు హోటల్‌ను చుట్టుముట్టాయి. భద్రతాబలగాల దాడిలో ఇద్దరు సాయుధ ఉగ్రవాదులు మృతి చెందారు. ఉగ్రవాదుల వద్ద బందీలుగా ఉన్న వారిలో అత్యధికులు యువకులు, మహిళలేనని చెబుతున్నారు. అర్థరాత్రి వరకు భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.