
TDP Leader Arrest: కడప జిల్లా టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవికి మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దాంతో రవిని పోలీసులు కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఆదివారం నాడు సాయంత్రం జిల్లా పోలీసులు బీటెక్ రవిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. బెంగళూరు నుంచి వచ్చిన ఆయనను పోలీసులు చైన్నై ఎయిర్ పోర్టులోనే నిర్బంధించారు. ఈ నేపథ్యంలో సోమవారం నాడు రవిని పులివెందుల మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. ఆ క్రమంలో మేజిస్ట్రేట్ బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో ఆయనను కపడ సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా, చట్ట ప్రకారమే బీటెక్ రవిని అరెస్ట్ చేశామని కడప జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు. 2018లో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య నెలకొన్న కేసులో బీటెక్ రవిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
కాగా, బీటెక్ రవి అరెస్ట్‌పై టీడీపీ శ్రేణులు భగ్గమంటున్నాయి. రాజకీయ కుట్రలో భాగంగానే బీటెక్ రవిని అరెస్ట్ చేశారంటూ టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. 2018 నాటి కేసులో ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లు ఏం చేశారని జిల్లా పోలీసులను టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. తన అరెస్ట్‌పై బీటెక్ రవి కూడా తీవ్రంగా స్పందించారు. జగన్ పాలనలో బయట ఉండటం కంటే జైలులోనే ప్రశాంతంగా ఉండగలం అని వ్యాఖ్యానించారు. ఎన్నికల వరకు తమను కస్టడీలో ఉంచినా నష్టమేమీ లేదని అన్నారు.
Also read: