పబ్‌జీ బ్యాన్ కోసం కోర్టుకు కుర్రోడి లెటర్..

| Edited By: Srinu

May 08, 2019 | 6:06 PM

పబ్‌జీ గేమ్ దేశవ్యాప్తంగా పరిచయం లేని గేమ్. 2018లో అత్యుత్తమ మొబైల్ గేమ్‌గా గూగుల్ గుర్తించిన పబ్‌జీ గేమ్‌పై మళ్లీ నిషేధం విధిస్తారా..? ఇటీవలే ఈ ఆటపై మద్రాస్ హైకోర్టు ఎత్తివేసిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రజల్లో ఈ గేమ్ పట్ల క్రేజ్ ఎంతగా పెరిగిపోయిందంటే.. ఈ గేమ్ ఆడొద్దన్నందుకు ప్రాణాలనే విడుస్తున్నారు కొంతమంది. ఇప్పుడు మళ్లీ ఈ గేమ్ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే..‌ ఈ గేమ్‌ను బాన్ చేయాలని ఓ 11 ఏళ్ల బాలుడు కోర్టుకు […]

పబ్‌జీ బ్యాన్ కోసం కోర్టుకు కుర్రోడి లెటర్..
Follow us on

పబ్‌జీ గేమ్ దేశవ్యాప్తంగా పరిచయం లేని గేమ్. 2018లో అత్యుత్తమ మొబైల్ గేమ్‌గా గూగుల్ గుర్తించిన పబ్‌జీ గేమ్‌పై మళ్లీ నిషేధం విధిస్తారా..? ఇటీవలే ఈ ఆటపై మద్రాస్ హైకోర్టు ఎత్తివేసిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రజల్లో ఈ గేమ్ పట్ల క్రేజ్ ఎంతగా పెరిగిపోయిందంటే.. ఈ గేమ్ ఆడొద్దన్నందుకు ప్రాణాలనే విడుస్తున్నారు కొంతమంది. ఇప్పుడు మళ్లీ ఈ గేమ్ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే..‌ ఈ గేమ్‌ను బాన్ చేయాలని ఓ 11 ఏళ్ల బాలుడు కోర్టుకు లెటర్ రాసి వార్తలకెక్కాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఈ ఆటను నిషేధించాలని కోరుతూ 11 ఏళ్ల బాలుడు మహారాష్ట్ర హైకోర్టుకు లెటర్ రాశాడు. ఈ లెటర్‌పై స్పందించిన కోర్టు ఓ కమిటీని నియమించింది. ఆటను ఎందుకు నిషేధించాలో 7 కారణాలు చూపుతూ ఈ కమిటీ ఓ నివేదికను తయారు చేసింది. త్వరలోనే ఈ రిపోర్టును కోర్టుకు అందించనుంది. దీన్ని యథావిథిగా అమలు చేస్తే పబ్‌జీ గేమ్‌ను దేశవ్యాప్తంగా బ్యాన్ చేయవచ్చని సమాచారం. చూడాలి మరి ఏమవుతుందో..? మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనతో అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. కాగా.. ఆ బాలుడెవరు అన్న విషయం తెలియాల్సి ఉంది.