ఉపేంద్రా.. దేశాన్ని ఇన్సల్ట్ చేస్తావా..నెటిజన్ల ఆగ్రహం

ఉత్తమ ప్రజాకీయ పార్టీ వ్యవస్థాపకుడు, కన్నడ నటుడు ఉపేంద్ర చేసిన ఓ ట్వీట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇటీవలే కుటుంబంతో సహా ఆయన అమెరికా పర్యటనకు వెళ్లారు. అయితే అక్కడి ఓ ప్రాంతానికి సంబంధించిన ఫోటోను మన దేశంలోని గ్రామీణ ప్రాంతంలోని ఫోటోను అప్‌లోడ్‌ చేశాడు. అయితే ఆ ఫోటోలలో మనదేశానికి, ఇతర దేశాలకు ఉన్న వ్యత్యాసం ఇది అంటూ ట్వీట్‌ చేశారు. అమెరికాలో విశాలమైన, స్వచ్ఛమైన రోడ్లు ఉన్నాయని.. మన దేశంలో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోందంటూ పోస్ట్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:48 pm, Tue, 7 May 19
ఉపేంద్రా.. దేశాన్ని ఇన్సల్ట్ చేస్తావా..నెటిజన్ల ఆగ్రహం

ఉత్తమ ప్రజాకీయ పార్టీ వ్యవస్థాపకుడు, కన్నడ నటుడు ఉపేంద్ర చేసిన ఓ ట్వీట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇటీవలే కుటుంబంతో సహా ఆయన అమెరికా పర్యటనకు వెళ్లారు. అయితే అక్కడి ఓ ప్రాంతానికి సంబంధించిన ఫోటోను మన దేశంలోని గ్రామీణ ప్రాంతంలోని ఫోటోను అప్‌లోడ్‌ చేశాడు. అయితే ఆ ఫోటోలలో మనదేశానికి, ఇతర దేశాలకు ఉన్న వ్యత్యాసం ఇది అంటూ ట్వీట్‌ చేశారు. అమెరికాలో విశాలమైన, స్వచ్ఛమైన రోడ్లు ఉన్నాయని.. మన దేశంలో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోందంటూ పోస్ట్ చేసిన ఫోటోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనదేశాన్ని తక్కువ చేసేలా ఫోటోలు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాతృదేశాన్ని.. ఇంకో దేశంతో తక్కువ చేసి పోల్చుతావా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు రాజకీయ పార్టీ పెట్టారు కదా.. ప్రభుత్వాన్ని ప్రశ్నించలేరా అంటూ.. ఎద్దేవా చేశారు. మొత్తానికి ఉపేంద్ర చేసిన ట్వీట్‌.. ప్రస్తుతం కన్నడనాడులో హాట్‌ టాపిక్‌గా మారింది.