మావోల ఘాతుకం.. భద్రతా దళలే టార్గెట్‌గా ఐఈడీ బ్లాస్ట్

జార్ఖండ్‌లో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు. భ్రదతా బలగాలనే టార్గెట్ చేస్తూ శక్తివంతమైన ఐఈడీ బాంబును పేల్చారు. ఈ పేలుడులో మొత్తం 11 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. రాష్ట్రంలోని ఖార్సవాన్ జిల్లా సిరాయికెల్లా గ్రామ పరిధిలో కుచాయి అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రతా దళాలు కూంబింగ్ చేపడుతుండగా.. ఉదయం 4:30 గంటలకు ఐఈడీ బాంబు పేలుడు సంభవించింది. ఈ దాడిలో 209 బెటాలియన్‌కు చెందిన ఎనిమిది మంది కోబ్రా జవాన్లు, ముగ్గురు జార్ఖండ్ […]

మావోల ఘాతుకం.. భద్రతా దళలే టార్గెట్‌గా ఐఈడీ బ్లాస్ట్
Follow us

| Edited By:

Updated on: May 28, 2019 | 10:16 AM

జార్ఖండ్‌లో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు. భ్రదతా బలగాలనే టార్గెట్ చేస్తూ శక్తివంతమైన ఐఈడీ బాంబును పేల్చారు. ఈ పేలుడులో మొత్తం 11 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. రాష్ట్రంలోని ఖార్సవాన్ జిల్లా సిరాయికెల్లా గ్రామ పరిధిలో కుచాయి అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

భద్రతా దళాలు కూంబింగ్ చేపడుతుండగా.. ఉదయం 4:30 గంటలకు ఐఈడీ బాంబు పేలుడు సంభవించింది. ఈ దాడిలో 209 బెటాలియన్‌కు చెందిన ఎనిమిది మంది కోబ్రా జవాన్లు, ముగ్గురు జార్ఖండ్ పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హెలికాప్టర్‌లో హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో మావోయిస్టుల కదలికలను గుర్తించిన భద్రతా బలగాలు.. వారి కోసం జల్లెడ పడుతున్నాయి.