Bigg Boss Telugu 4 winner Abhijeet : ఆ విషయంలో అభిజీతే టాప్..తెగ ట్రెండ్ చేస్తోన్న నెటిజన్లు

|

Dec 29, 2020 | 9:55 PM

బిగ్‌బాస్‌ ఫోర్త్ సీజన్ ఓటింగ్‌ ఎలా జరిగింది.. వన్‌సైడెడ్‌గా జరిగిందా.. వార్‌ వన్‌సైడే అనే రేంజ్‌లో నడిచిందా. అయిపోయాక ఇప్పుడు వివాదాలు ఎందుకులేండి.

Bigg Boss Telugu 4 winner Abhijeet : ఆ విషయంలో అభిజీతే టాప్..తెగ ట్రెండ్ చేస్తోన్న నెటిజన్లు
Follow us on

బిగ్‌బాస్‌ ఫోర్త్ సీజన్ ఓటింగ్‌ ఎలా జరిగింది.. వన్‌సైడెడ్‌గా జరిగిందా.. వార్‌ వన్‌సైడే అనే రేంజ్‌లో నడిచిందా. అయిపోయాక ఇప్పుడు వివాదాలు ఎందుకులేండి. ఇప్పుడు మాత్రం అభిజిత్- ది రియల్ విన్నర్‌ అనే నమ్మకమైతే కలుగుతోంది. ఎందుకంటారా అక్కడికే వస్తున్నాం. ఈ ఏడాదిలో.. టాప్‌ హండ్రెడ్ మోస్ట్ హ్యాండ్‌సమ్‌ ఫేసెస్‌ ఎవరు..? ఆన్‌లైన్‌లో ఈ హ్యాష్‌ట్యాగ్‌ తెగ నడుస్తోందిప్పుడు. అయితే ఈ పోల్‌లో అభిజిత్ పేరే టాప్‌లో ట్రెండ్‌ అవ్వడం విశేషం.

మేము అభిజిత్‌ని నామినేట్ చేస్తున్నాం.. తెలుగు సినిమాల్లో అతడు కాబోయే రారాజు.. అని ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఓట్ చేస్తున్నారు నెటిజన్లు. వాళ్లు పోస్ట్ చేసే ఫోటోలు కూడా అభిజిత్‌ హీరోయిజాన్ని చాలా రిచ్‌గా రిప్రెజెంట్ చేస్తున్నాయ్. సింగర్ దర్శన్ రావల్, హిందీ బిగ్‌బాస్ ఫేమ్‌ రాహుల్ వైద్య.. ఇలా మిగతా యంగ్‌ స్టార్స్ కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు. కానీ అభిజిత్‌ సెంట్రిక్‌గానే ట్రెండ్‌ అవుతోందీ హ్యాండ్‌సమ్‌ హ్యాష్‌టాగ్. గతంలో బిగ్‌బాస్ విన్నర్స్‌.. శివబాలాజీ, కౌశల్‌ మండా, రాహుల్‌ సిప్లిగంజ్‌.. ఎంతెంత హీరోలయ్యారో గాని.. ఈ కుర్రాడు మాత్రం సమ్‌థింగ్‌ స్పెషల్ అనిపిస్తున్నాడు.

Also Read : 

New Coronavirus Strain in AP : ఏపీలో తొలి స్ట్రెయిన్ వైరస్ కేసు నమోదు..రాజమండ్రి వచ్చిన మహిళకు పాజిటివ్‌గా నిర్ధారణ

Molar Pregnancy : విచిత్రమైన ముత్యాల గర్భం…ప్రెగ్నంట్ అవుతారు..కానీ కడుపులో బిడ్డ ఉండదు