Ration Card: ఒకే రేషన్‌ కార్డులో 68 మంది సభ్యులు.. 38 క్వింటాళ్ల ధాన్యం వచ్చినట్లు గుర్తింపు.. డీలర్‌పై కేసు నమోదు

Ration Card: సాధారణంగా రేషన్‌ కార్డులో ఇద్దరు లేదా.. ముగ్గురు, మరీఅయితే డజను లేపు కుటుంబ సభ్యులుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా 68 మంది

Ration Card: ఒకే రేషన్‌ కార్డులో 68 మంది సభ్యులు.. 38 క్వింటాళ్ల ధాన్యం వచ్చినట్లు గుర్తింపు.. డీలర్‌పై కేసు నమోదు
Ration Card
Follow us
Subhash Goud

|

Updated on: Mar 23, 2021 | 8:13 AM

Ration Card: సాధారణంగా రేషన్‌ కార్డులో ఇద్దరు లేదా.. ముగ్గురు, మరీఅయితే డజను లేపు కుటుంబ సభ్యులుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా 68 మంది సభ్యులతో కూడిన రేషన్‌ కార్డు ఉండటం, వారిలో హిందూ, ముస్లింలు కూడా ఉండటం బీహార్‌లో సంచలనం సృష్టిస్తోంది. బీహార్‌లోని మహువా ఎస్డీఓ సందీప్‌ కుమార్‌ ఆదేశాల మేరకు స్థానిక అధికారులు ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

వైశాలి జిల్లాలో ఆహార ధాన్యాల పంపిణీ వివరాలను పరిశీలిస్తుండగా, ఒకే కుటుంబానికి ఏకంగా 38 క్వింటాళ్ల ధాన్యం వచ్చినట్లు కనిపించడంతో అధికారులు అవాక్కయ్యారు. స్థానిక రేషన్‌ డీలర్‌ సంజయ్‌ కుమార్‌పై కేసు నమోదు చేశారు. అధికారులు లబ్దిదారుల నుంచి ధాన్యాన్ని రికవరీ చేసే పనిలో పడ్డారు. ఒకే కార్డులో ఇంత మంది ఎలా వచ్చారనే దానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. అయితే ఇంత మంది సభ్యులు రేషన్‌ కార్డులో ఉండగా, రేషన్‌ డీలార్‌ కూడా అధికారులకు సమాచారం ఇవ్వకపోవడంపై ఆయనపై కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు.

ఇవీ చదవండి :

Google Pay App FASTag: గూగుల్‌ పేను ఉపయోగించి మీ ఫాస్ట్‌ట్యాగ్‌ను రీఛార్జ్ చేయడం ఎలా..? సులభమైన పద్దతుల్లో.

రేషన్ సరుకులు అందిస్తామని డబ్బుల వసూలు.. 8 లక్షలతో ఎస్కేప్.. ఒక్కొక్కరి నుంచి ఎంత తీసుకున్నారంటే..