పొట్టి క్రికెట్‌లో 9 వేల పరుగులు పూర్తి చేసుకున్న కోహ్లీ

ఐపీఎల్‌లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు.. టీ-20 ఫార్మట్‌లో తొమ్మిది వేల పరుగులను పూర్తి చేసుకున్న తొలి ఇండియన్‌ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు.

పొట్టి క్రికెట్‌లో 9 వేల పరుగులు పూర్తి చేసుకున్న కోహ్లీ
Follow us
Balu

| Edited By: Anil kumar poka

Updated on: Oct 06, 2020 | 2:01 PM

ఐపీఎల్‌లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు.. టీ-20 ఫార్మట్‌లో తొమ్మిది వేల పరుగులను పూర్తి చేసుకున్న తొలి ఇండియన్‌ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు విజయాన్ని అందుకోలేకపోయింది కానీ.. కోహ్లీ మాత్రం అందిపుచ్చుకున్న తన ఫామ్‌ను కొనసాగిస్తూ 43 పరుగులు చేశాడు.. టీ-20లలో అత్యధిక పరుగులు చేసి మొదటి స్థానంలో ఉన్నది వెస్టిండీస్‌ చిచ్చరపిడుగు క్రిస్‌ గేల్‌.. ఇతను ఇప్పటి వరకు 404 మ్యాచ్‌లు ఆడి 13, 296 పరుగులు చేశాడు.. వెస్టిండీస్‌కే చెందిన కీరన్‌ పొలార్డ్‌ రెండోస్థానంలో ఉన్నాడు.. ఇతను 10,370 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు.. పాకిస్తాన్‌ ప్లేయర్‌ షోయబ్‌ మాలిక్‌ 9,926 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌కు చెందిన బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ 9,922 పరుగులతో నాలుగో ప్లేస్‌లో, ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్‌ వార్నర్‌ 9,451 రన్స్‌తో అయిదో ప్లేస్‌లో, ఆస్ట్రేలియాకే చెందిన ఆరోన్‌ ఫించ్‌ 9,146 పరుగులతో ఆరో ప్లేస్‌లో ఉన్నారు.. అత్యధిక పరుగులు సాధించిన వారి చిట్టాలో ఇప్పుడు కోహ్లీ ఏడో స్థానంలో ఉన్నాడు.. టీ-20 ఫార్మాట్‌లలో కోహ్లీకి 70 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.. ఇందులో కూడా కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు.. సగటుల్లో కూడా కోహ్లీది థర్డ్‌ ప్లేసే! ఇక అంతర్జాతీయ టీ-20ల విషయానికి వస్తే విరాట్‌ కోహ్లీ 2,794 పరుగులతో ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్నాడు.. తర్వాతి స్థానం రోహిత్‌శర్మది.. ఇతడు 2,773 పరుగులు చేశాడు. ఐపీఎల్‌ టోర్నమెంట్లలో విరాట్ కోహ్లీ 5,524 పరుగులు చేసి అందరికంటే ముందున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఈసారి ఐపీఎల్‌కు దూరంగా ఉన్న చెన్నై ఆటగాడు సురేశ్‌ రైనా 5,368 పరుగులతో సెకండ్‌ ప్లేస్‌లో ఉన్నాడు. ముంబాయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 5,074 పరుగులతో థర్డ్‌ ప్లేస్‌లో ఉన్నాడు.