IPL 2020 : KXIP vs MI షెల్డన్ కాట్రెల్ స్థానంలో ముజీబ్…!
ఐపీఎల్-13వ సీజన్‌లో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షెల్డన్ కాట్రెల్‌పై వేటు పడే ఛాన్స్ కనిపిస్తోంది. ఐపీఎల్2020లో అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియా సిక్సర్లను అభిమానులు మరిచిపోలేక పోతున్నారు.
ఐపీఎల్-13వ సీజన్‌లో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షెల్డన్ కాట్రెల్‌పై వేటు పడే ఛాన్స్ కనిపిస్తోంది. ఐపీఎల్2020లో అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్న రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రాహుల్ తెవాటియా సిక్సర్లను అభిమానులు మరిచిపోలేక పోతున్నారు. కాట్రెల్ ఓవర్‌లో ఆరు బంతుల్లో ఐదు సిక్సర్లు బాదిన రాహుల్ రాత్రికి రాత్రే హీరోగా మారిపోయాడు. పేలవ బౌలింగ్ జట్టు ఓటమికి కారణమైన కాట్రెల్‌ను తుది జట్టు నుంచి తప్పించాలని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ భావిస్తున్నట్లు తెలిసింది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు కాట్రెల్ స్థానంలో అఫ్గనిస్థాన్ యువ స్పిన్నర్ ముజీబ్ రెహమాన్‌ను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
అబుదాబిలోని మైదానం షార్జా కన్నా చాలా పెద్దది.. ఈ గ్రౌండ్‌లో స్పిన్నర్లు కీలకపాత్ర ఉంటుంది. దీంతో గత మ్యాచ్‌లో తేలిపోయిన కాట్రెల్ స్థానంలో రెహమాన్‌కు అవకాశం ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. తుదిజట్టులోకి ఎంపిక చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోంది. ఒకవేళ స్పిన్నర్ ముజీబ్‌ను ఎంపిక చేస్తే భారత స్పిన్నర్ ఎం. అశ్విన్‌కు విశ్రాంతినిచ్చి మరో భారత పేసర్ ఇషాన్ పొరెల్‌ను ఆడించే అవకాశాలున్నాయి.