మీకు తెలిసి రైలు టికెట్ ధర ఎంత ఉంటుంది.? మహా అయితే ఓ రూ. 10 వేలు ఉంటుంది అంటారు కదూ! అయితే రైలు టికెట్ ధర అక్షరాల రూ. 20 లక్షలు. అవును రైలు టికెట్ ధర అక్షరాల రూ. 20 లక్షలు. అయితే ఈ రైలు ఎక్కడో విదేశాల్లో ఉందనుకునే మన దేశంలోనే అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ రైలు ప్రత్యేకత ఏంటి.? టికెట్ ధర అంతలా ఉండేందుకు కారణం ఏంటి.? తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
ఆసియాలోనే అత్యంత ఖరీదైన రైలు టికెట్‌గా పేరుగాంచిన రైలుగా మహారాజా ఎక్స్‌ప్రెస్ పేరు గాంచింది. మహారాజా ఎక్స్‌ప్రెస్‌లో మొత్తం 7 రోజుల ప్రయాణం ఉంటుంది. ఎక్కువగా విదేశీ యాత్రికులు ఈ రైల్లో ప్రయాణించడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఈ రైలు ఇంటీరియర్ ఒక ఇంద్రభవనాన్ని తలపిస్తుంది. ఇందులో ప్రయాణించే వారికి వెండి పాత్రల్లో ఆహారాన్ని అందిస్తారు. ముఖ్యంగా ఈ రైలులో ఉండే ప్రెసిడెన్షియల్ సూట్ అత్యంత లగ్జరీగా ఉంటుంది.
అందుకే ప్రెసిడెన్షియల్ సూట్ ధర అక్షరాల రూ. 20 లక్షలు కావడం విశేషం. అధునాతన సౌకర్యాలు ఈ రైలు ప్రత్యేకతలుగా చెప్పొచ్చు. ఈ రైలు టికెట్ తీసుకుంటే మొత్తం 7 రోజుల ప్రయాణం ఉంటుంది. ఈ ప్రయాణంలో ఫైవ్ స్టార్ హోటల్ సేవలతో పాటు తాజ్ మహల్, ఖజురహో, రణతంబోర్ మీదుగా దేశంలోని పలు పర్యాటక ప్రదేశాల మీదుగా సాగుతోంది. ఫతేపూర్ సిక్రితో పాటు వారణాసి వంటి పర్యాటక ప్రదేశాలు కవర్ అవుతాయి.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ రైలు నడుస్తుంది. ఈ రైలులో ప్రతీ కోచ్‌లో షవర్‌లతో కూడిన బాత్‌రూమ్‌లు, రెండు మాస్టర్ బెడ్ రూమ్‌లు అందిస్తారు. దీంతో కుటుంబంతో కలిసి ప్రయాణించవచ్చు. అంతేకాకుండా ఈ రైలులో ప్రతీ కోచ్‌లో మినీ బార్ కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు అదనంగా లైవ్ టీవీ, ఎయిర్ కండీషనర్, బయట ప్రదేశాలు చూడ్డానికి పెద్ద గ్లాస్ విండోలను అందించారు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..