Viral: రూ. 8 కోట్ల విలువైన వెడ్డింగ్ కేక్‌.. అంత స్పెషల్‌ ఏంటనేగా.?

|

Nov 30, 2023 | 6:04 PM

ప్రపంచంలో అత్యంత ఖరీదైన పేరుగా గాంచిన ఈ కేక్‌ అరబ్‌ వధువు ఆకారంలో రూపొందించారు. దుబాయ్‌కి చెందిన డెబ్బీ వింగ్‌హామ్‌ అనే టీమ్‌ ఈ కేక్‌ను తయారు చేశారు. వధువు ఆకారంలో ఈ కేక్‌ను రూపొందించారు. అచ్చంగా దుబాయ్‌ వధువు ఆకారంలో ఈ కేక్‌ను రూపొందించారు. ఈ కేక్‌ను ఏకంగా 182 సెంటీమీటర్ల ఎత్తు, 120 కిలోల బరువుతో రూపొందించారు. ఈ కేక్‌ను తయారు చేయడానికి పది రోజుల సమయం పట్టింది. కేక్‌ తయారీకి...

Viral: రూ. 8 కోట్ల విలువైన వెడ్డింగ్ కేక్‌.. అంత స్పెషల్‌ ఏంటనేగా.?
Cake
Follow us on

ఒకప్పుడు కేవలం పుట్టిన రోజు, పెళ్లి రోజులకే ఎక్కువగా కేక్‌లు కట్‌ చేసేవారు. కానీ తర్వాత వివాహ వేడుకల్లోనూ కేక్‌ కట్ చేయడం కల్చర్‌ పెరిగింది. పెళ్లిలలో కేక్‌లు కట్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇదిలా ఉంటే సాధారణంగా మనకు తెలిసినంత వరకు కేక్‌ ధర మహా అయితే వేల రూపాయల్లో ఉంటుంది. అయితే రూ. 8 కోట్ల విలువైన కేక్‌ ఉందంటే నమ్ముతారా.? అవును ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కేక్‌కు సంబంధించిన వివరాలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన పేరుగా గాంచిన ఈ కేక్‌ అరబ్‌ వధువు ఆకారంలో రూపొందించారు. దుబాయ్‌కి చెందిన డెబ్బీ వింగ్‌హామ్‌ అనే టీమ్‌ ఈ కేక్‌ను తయారు చేశారు. వధువు ఆకారంలో ఈ కేక్‌ను రూపొందించారు. అచ్చంగా దుబాయ్‌ వధువు ఆకారంలో ఈ కేక్‌ను రూపొందించారు. ఈ కేక్‌ను ఏకంగా 182 సెంటీమీటర్ల ఎత్తు, 120 కిలోల బరువుతో రూపొందించారు. ఈ కేక్‌ను తయారు చేయడానికి పది రోజుల సమయం పట్టింది. కేక్‌ తయారీకి ఏకంగా 1000 కోడిగుడ్లు, 20 కిలోల చాక్లెట్‌ను ఉపయోగించారు. ఇక ఇక్కడితోనే ఆగిపోలేదు.

ఈ కేక్‌లో 50 కిలోల లాసీ మిఠాయిను ఉపయోగించారు. అలాగే ఇందులో తినదగిన 3 క్యారెట్‌ వజ్రాలు, ముత్యాలు కూడా ఉన్నాయి. ఇందులో ఉంచిన వజ్రాలు లక్షల్లో విలువ ఉంది. రైస్‌ క్రిస్పీ, మోడలింగ్ చాక్లెట్‌తో ఈ కేక్‌ను రూపొందించారు. 20 కిలోల బెల్జియన్‌ చాక్లెట్‌ను ఉపయోగించారు. దీని ఖరీదు ఎక్కువగా ఉంటుంది. ఇక 50 కిలోల కేక్‌ ఫాండెంట్‌, 5వేల హ్యాండ్‌మేడ్ ఫాండెంట్‌ పువ్వులతోఘీ వెడ్డింగ్‌ గౌన్‌ను ప్రత్యేకంగా వెడ్డింగ్‌ గౌన్‌ను తయారు చేశారు.

రూ. 8 కోట్ల విలువైన ఈ కేక్‌ను దుబాయ్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఇక డ్రస్‌పై ఉన్న ఉండే ఫ్లవర్స్‌ సైతం స్వీట్‌తో తయారు చేశారు. 5వేలకిపై గా పూలు, 10000 ముత్యాలు, 110 పౌండ్స్‌తో కేక్‌ ఫౌండేషన్‌ను రూపొందించారు. ఇక 2లక్షల డాలర్ల విలువైన డైమండ్స్‌ను కేక్‌లో పొందుపరిచారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..