మీరు చాలా రకాల మామిడి పండ్లను చూసి ఉండవచ్చు… కానీ ఇలాంటి మామిడి పండును ఎప్పుడు చూడకపోవచ్చు. మీరు ఒక చూపులో ఆ పండు సాధారణమైనదా… మరేదైనా ప్రత్యేకత ఉందా అనేది ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఇది అచ్చం పుచ్చకాయలా ఉంటుంది. బరువు, పరిమాణంలో ఇది పుచ్చకాయ కంటే తక్కువ కాదు. ఎందుకంటే ఇది సాధారణంగా 4 కిలోల కంటే ఎక్కువగా ఉంది. అవును, మామిడి పండ్లలో కూడా అలాంటి మహారాజా మామడి వెరైటీ ఉంది. అదేంటో… ఈ పండు ప్రత్యేకతలు ఏంటో ఓ సారి చూద్దాం..
పుచ్చకాయ లాంటి ఈ మామిడి ఎక్కడ అని మీరు ఆలోచిస్తూ ఉండాలి. మామిడి అనేక కిలోల బరువుతో ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న నిజమైనదే.. ఎందుకంటే ఇది భారతదేశంలో కనిపించదు. మనం ఇక్కడ మాట్లాడుతున్న రకం భారతదేశంకు చెందిన వెరైటీ కాదు…, కొలంబియాకు చెందిన ఓ రైతు ఈ మామాడి రకం పండిస్తున్నాడు. మీరు ఇప్పటివరకు అత్యంత రుచికరమైన మామిడి గురించి విన్నట్లయితే.. ఈ మామిడి అంతకంటే ఎక్కువ రుచిగా ఉంటుంది.
కొలంబియన్ రైతులు పండించిన ఈ వెరైటీ.. ప్రపంచంలోనే అతి భారీ మామిడి పండుగా గుర్తింపును అందుకుంటోంది. ఈ మామిడి గిన్నిస్ రికార్డ్‌లో చోటు దక్కించుకుంది. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం.., కొలంబియాలోని చిన్న ప్రదేశమైన గువాయితాలో రైతులు ఈ మామిడిని సాగు చేశారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గుర్తించిన లెక్క ప్రకారం ఈ మామిడి బరువు 4.25 కిలోలు.
తమ వ్యవసాయ క్షేత్రంలో పెరుగుతున్నఈ మామిడి సాధారణం కాదని, ప్రపంచంలో ఇది చాలా భిన్నమైనదని రైతు కుటుంబం ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ వార్త చాలా విస్తృతంగా వైరల్ అవడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ నిపుణులు ఈ రైతు క్షేత్రాన్ని సందర్శించి మామిడి బరువును లెక్కించారు. దీంతో ఈ మామిడికి గిన్నిస్ ప్రపంచ రికార్డులో చోటు దక్కించుకుంది. ఇలాంటి మామిడి ప్రపంచంలో ఎక్కడా లేదని.., ఇంతకు ముందు ఏ మామిడి ఇలాంటి రికార్డును క్రియేట్ చేయ చేయలేదని గిన్నిస్ రికార్డ్ నిపుణులు అంటున్నారు.
కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఉద్యోగం వదిలిపెట్టిన ఈ కుటుంబం .. వ్యవసాయ సాగుపై ఫోకస్ పెట్టింది. అయితే వారు చేసిన ప్రయత్నం రెండు సంవత్సరాల్లోనే ఫలితాన్ని ఇచ్చింది. ఈ మామిడిని ఉత్పత్తి చేసిన కొలంబియా రైతులు కష్టపడి పనిచేశారు. అంకితభావంతో ప్రేమతో పండించాలని సందేశాన్ని ఇస్తున్నారు. ఈ విధంగా పండించినట్లయితే అవుట్పుట్ ఎల్లప్పుడూ మంచిగా ఉంటుదని అంటున్నారు. ఇలాంటి సమయంలో ఏదైనా కొత్తగా ప్లాన్ చేయాలి అని అంటున్నారు.